Telugu Global
Cinema & Entertainment

Aa Okkati Adakku | ఆ ఒక్కటి అడక్కు విడుదల తేదీ

Aa Okkati Adakku - అల్లరోడు నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

Aa Okkati Adakku | ఆ ఒక్కటి అడక్కు విడుదల తేదీ
X

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. అల్లరి నరేష్ ఈ జానర్ లో సినిమా చేసి చాన్నాళ్లయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ నవ్వులు పూయించగా.. తాజాగా విడుదల తేదీ ప్రకటించారు. మే 3న థియేటర్లలోకి వస్తోంది ఆ ఒక్కటి అడక్కు సినిమా.

చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లరి నరేష్ ను పూర్తిగా ఫన్ క్యారెక్టర్ లో చూడాలని సినీ అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమా ఆ లోటు తీరుస్తుంనది చెబుతున్నాడు అల్లరి నరేష్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశాడు.

టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశాడు.

First Published:  15 April 2024 5:13 PM GMT
Next Story