Telugu Global
Cinema & Entertainment

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ట్రయిలర్ ఎలా ఉందంటే?

కృతి శెట్టి నుంచి నెలకో సినిమా చొప్పున వరుసగా సినిమాలొస్తున్నాయి. జులైలో ఒకటి, ఆగస్ట్ లో ఒకటి వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ లో ఇంకో సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశాడు.

వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైంది. కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం, చెడు అభిప్రాయం. ఇలాంటి నేపద్యంలో హీరోహీరోయిన్ల ప్రేమకథ ఎలా ముగుస్తుందనేది ఈ సినిమా స్టోరీ.

సినిమాలంటే అందరికీ ఇష్టం. అయితే ఇండస్ట్రీపై కొంతమందికి చెడు అభిప్రాయం ఉంది. ఈ అంశం కారణంగా తమ ఆడ బిడ్డల్ని పరిశ్రమకు పంపేందుకు తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రగంటి ఈ సినిమాకి కథాంశంగా ఇదే సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు.

యంగ్ ఫిల్మ్ మేకర్ గా, మంచి ఎమోషన్స్ పండించాడు సుధీర్ బాబు. నటిని కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి అందంగా ఉంది. సినిమాలో ఆమెకు పెర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. వెన్నెల కిషోర్ కామెడీ క్లాస్ గా ఉంది.

పిజి విందా సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ సంగీతం క్లాస్‌గా ఉన్నాయి. ప్రధాన పాత్రల‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు, కథ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చెప్పేశారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా 16వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.



First Published:  6 Sep 2022 4:44 AM GMT
Next Story