Telugu Global
Cinema & Entertainment

సుధీర్ బాబు సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

సుధీర్ బాబు కొత్త సినిమా పేరు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.

సుధీర్ బాబు సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు నిర్మాతలు.

ఈ చిత్రంలో నైట్రో స్టార్ సుధీర్ బాబుకు జోడిగా కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంద్రగంటి గత సినిమాల్లాగే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కొత్త కొత్త గా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి పిజి విందా సినిమాటోగ్రఫర్ గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

First Published:  10 Aug 2022 5:15 PM GMT
Next Story