Telugu Global
Cinema & Entertainment

Ravanasura: రవితేజ సినిమా నుంచి స్పెషల్ సాంగ్

Ravanasura Movie Special song - రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది.

Ravanasura: రవితేజ సినిమా నుంచి స్పెషల్ సాంగ్
X

రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్ చేతుల మీదగా ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నారు.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌ కు మంచి స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రజంట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించాడు.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7న రావణాసుర థియేటర్స్ లోకి వస్తోంది.

First Published:  29 Jan 2023 1:46 PM GMT
Next Story