Telugu Global
Cinema & Entertainment

Trivikram | త్రివిక్రమ్ చూపు అటు.. ఈ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు

Trivikram - గుంటూరుకారం తర్వాత త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు..? అతడి ముందున్న ఆప్షన్లు ఏంటి?

Trivikram | త్రివిక్రమ్ చూపు అటు.. ఈ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు
X

త్రివిక్రమ్ కు ఆప్షన్లు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. అయితే అది గుంటూరుకారం ఎఫెక్ట్ కాకపోవచ్చు. కొంతమంది హీరోలతో త్రివిక్రమ్ కు వర్క్ చేయాలని ఉంది. కానీ వాళ్లు అందుబాటులో లేరు. కొంతమంది హీరోలకు త్రివిక్రమ్ తో వర్క్ చేయాలని ఉంది, కానీ ఈ దర్శకుడికి ఆసక్తి లేదు.

బన్నీతో సినిమా చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. పుష్ప-2 తర్వాత త్రివిక్రమ్ తోనే అనుకున్నారు. కానీ బన్నీ ప్లాన్స్ పాన్-ఇండియా రేంజ్ లో ఉన్నాయి. అట్లీ పేరు తెరపైకొచ్చింది. బహుశా గుంటూరు కారం రిజల్ట్ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఈ పాటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటాడు.

బన్నీ కుదరకపోతే తారక్ రెడీ అనుకున్నారు కొంతమంది. కానీ దేవర ప్రాజెక్టు డిలే అవుతోంది. పైగా పార్ట్-2 కూడా ఉంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ సినిమా ఉండనే ఉంది. అక్కడ త్రివిక్రమ్ కు చోటు దొరికేలా లేదు. ఉన్నఫలంగా సలార్-2 మొదలైతే, ప్రశాంత్ అటు బిజీ అవుతాడు కాబట్టి.. ఇటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో వర్కవుట్ అవుతుందనేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే, చెప్పుకునేంత సులువుగా జరిగేది కాదిది.

ఇక త్రివిక్రమ్ లిస్ట్ లో ఉన్న మరో పెద్ద హీరో పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ ఓకే అంటే పవన్ ఎప్పుడూ ఓకే. కథ కూడా ఏంటని అడిగే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎటొచ్చి పవన్ తో సినిమా ఎత్తుకుంటే, త్రివిక్రమ్ కే ఇబ్బంది. ఆల్రెడీ పవన్ చేతిలో సినిమాలున్నాయి. వాటిని పక్కనపెట్టి తన సినిమానే ముందుకు తీసుకొచ్చేంత సమర్థత త్రివిక్రమ్ కు ఉంది. కాకపోతే పవన్ ను సెట్స్ పైకి తీసుకొచ్చేంత శక్తి మాత్రం ఎవ్వరికీ లేదు.

ఆ హీరోల చూపు మాత్రం త్రివిక్రమ్ వైపు..

త్రివిక్రమ్ చూపు ఇలా సాగుతుంటే, అటు మరికొంతమంది హీరోలు మాత్రం త్రివిక్రమ్ వైపు చూస్తున్నారు. గతంలో నితిన్ జాక్ పాట్ కొట్టినట్టు, తమతో కూడా త్రివిక్రమ్ సినిమాలు తీస్తాడని ఎదురుచూస్తున్నారు. వీళ్లలో ఎప్పట్నుంచో వెయిటింగ్ లో ఉన్న హీరో రామ్ పోతినేని.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా సినిమా చేయాలని స్రవంతి రవికిషోర్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈమధ్య ఆ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అటు నాని కూడా త్రివిక్రమ్ కోసం వెయిటింగ్ అంటూ ఈమధ్య ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.

ఇలా కొంతమంది హీరోలు త్రివిక్రమ్ వైపు చూస్తుంటే, త్రివిక్రమ్ మాత్రం మరికొంతమంది హీరోల వైపు చూస్తున్నాడు. లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉన్నాడు. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ కండిషన్స్ మధ్య ఈ ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు.

First Published:  24 Jan 2024 4:50 PM GMT
Next Story