Telugu Global
Cinema & Entertainment

ఈరోజు ఏకంగా 7 సినిమాలు రిలీజ్

ఈరోజు ఏకంగా 7 కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఎన్ని క్లిక్ అవుతాయో..!

ఈరోజు ఏకంగా 7 సినిమాలు రిలీజ్
X

టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈరోజు ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కాస్త ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా థాంక్యూ మాత్రమే. మిగతా సినిమాల్లో వేటిపై పెద్దగా అంచనాల్లేవ్. ఆ సినిమాలేంటో చూద్దాం.

నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాపై ఎందుకో ముందు నుంచి పెద్దగా బజ్ కనిపించలేదు. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపించింది.

థాంక్యూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం 30శాతం కూడా ఆక్యుపెన్సీ కనిపించలేదు. ఇక ఈ సినిమాను ఆదుకోవాల్సింది కేవలం కంటెంట్ మాత్రమే. కంటెంట్ అద్భుతంగా ఉండి, మౌత్ టాక్ ఫుల్ పాజిటివ్ గా ఉంటే తప్ప ఈ సినిమాకు ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదు. టికెట్ రేట్లు మల్టీప్లెక్సుల్లో 200 చెప్పి 250 రూపాయలు చేయడం కూడా ఈ సినిమాకు దెబ్బే.

ఈ సినిమాతో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో మూవీ దర్జా. సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమాగా దీనికి ప్రచారం చేశారు. అయితే వీళ్లవి ప్రధాన పాత్రలు కావని, కేవలం కీలక పాత్రలు మాత్రమేనని, హీరోహీరోయిన్లు వేరే వాళ్లు ఉన్నారనే విషయం పైకి చెప్పడం లేదు. ఈ ఫేక్ ప్రచారంతో ఈ సినిమా ఈరోజు థియేటర్లలో ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

ఇక అమ్మ రాజశేఖర్ డైరక్ట్ చేసిన హైయ్ ఫైవ్, అంతా కొత్తవాళ్లు కలిసి తీసిన మీలో ఒకడు, జగన్నాటకం సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిపై జనాల్లో ఎలాంటి ఆశక్తి లేదు. డబ్బింగ్ విషయానికొస్తే.. 2 సినిమాలు ఓ మోస్తరు అంచనాలు పెంచుతున్నాయి. అవే షంషేరా, మహా.

రణబీర్ హీరోగా నటించిన పీరియాడిక్ మూవీ షంషేరా. ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. తెలుగులో కూడా ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. ఇక హన్సిక నటించిన 50వ చిత్రంగా వస్తోంది మహా. విడిపోయిన తర్వాత హన్సిక-శింబు కలిసి చేసిన సినిమాగా కూడా మహాపై ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలు కూడా ఈరోజే థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  22 July 2022 4:30 AM GMT
Next Story