Telugu Global
Cinema & Entertainment

జాతీయ అవార్డులు.. మెరిసిన కలర్ ఫొటో

68వ జాతీయ అవార్డుల్ని ప్రకటించారు. 2020 సంవత్సరంలో రిలీజైన సినిమాలకు గాను అవార్డుల జాబితా రిలీజైంది.

జాతీయ అవార్డులు.. మెరిసిన కలర్ ఫొటో
X

68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఈసారి కూడా కొన్ని తెలుగు సినిమాలు మెరిశాయి. మరీ ముఖ్యంగా కలర్ ఫొటోకు మంచి గుర్తింపు దక్కింది. జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫొటో నిలిచింది. సందీప్ రాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సుహాస్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇక మిగతా తెలుగు సినిమాల్లో అల వైకుంఠపురములో సినిమాకు కూడా గుర్తింపు దక్కింది. ఉత్తమ సంగీతం/పాటలు విభాగంలో ఈ సినిమాకు అవార్డు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ హిట్టయిన సంగతి తెలిసిందే. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో సంధ్యారాజు (నాట్యం)కు అవార్డ్ దక్కింది. ఈ సినిమాకు కొరియోగ్రఫీ అందించడంతో పాటు, ఆమె స్వయంగా లీడ్ రోల్ పోషించారు. ఇదే సినిమాకు గాను ఉత్తమ మేకప్ విభాగంలో రాంబాబు జాతీయ అవార్డ్ కు ఎంపికయ్యారు.

ఓవరాల్ గా చూసుకుంటే తమిళ్ నుంచి వచ్చి సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా), మలయాళం నుంచి అయ్యప్పనుమ్ కోషియమ్ (భీమ్లానాయక్ కు మాతృత) సినిమాల డామినేషన్ అవార్డుల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కువ అవార్డులు ఈ రెండు సినిమాలకే దక్కాయి. ఉత్తమ నటుడు విభాగంలో సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవగన్ (తానాజీ) అవార్డ్ పంచుకోబోతున్నారు.

ఉత్తమ నటుడు - సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవగన్ (తానాజీ)

ఉత్తమ నటి - అపర్ణ బాలమురళి (సూరారై పొట్రు)

ఉత్తమ చిత్రం - సూరారై పొట్రు

ఉత్తమ దర్శకుడు - సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)

ఉత్తమ సహాయ నటుడు - బిజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)

ఉత్తమ యాక్షన్ డైరక్టర్ - రాజశేఖర్, మాఫియా శశి (అయ్యప్పనుమ్ కోషియమ్)

ఉత్తమ కొరియోగ్రఫీ - నాట్యం (సంధ్యారాజు)

ఉత్తమ సంగీతం - అల వైకుంఠపురములో (తమన్)

ఉత్తమ నేపథ్య సంగీతం - సురారై పోట్రు (జీవీ ప్రకాష్ కుమార్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కప్పెల (అనీష్ నదోడి)

ఉత్తమ ఎడిటింగ్ - శివరంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం (శ్రీకర్ ప్రసాద్)

ఉత్తమ స్క్రీన్ ప్లే - సురారై పొట్రు

ఉత్తమ డైలాగ్స్ - మండేలా

ఉత్తమ నేపథ్యగాయని - నన్నచ్చమ్మ (అయ్యప్పనుమ్ కోషియమ్)

First Published:  22 July 2022 1:49 PM GMT
Next Story