Telugu Global
Cinema & Entertainment

Weekend Release | ఈరోజు హిట్టయ్యే సినిమా ఏది?

Weekend release - ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవ్వడంతో థియేటర్లలో మళ్లీ సినిమాల సందడి పెరిగింది. ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Weekend Release | ఈరోజు హిట్టయ్యే సినిమా ఏది?
X

ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవ్వడంతో థియేటర్లలో మళ్లీ సినిమాల సందడి పెరిగింది. ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో క్లిక్ అయ్యే సినిమా ఏది.. హైప్ తో వస్తున్న మూవీ ఏది?

ఈరోజు థియేటర్లలోకి కూసింత అంచనాలతో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన ఈ సినిమాను హర్ష తెరకెక్కించాడు. లాజిక్ పట్టించుకోకుండా, కామెడీ మాత్రమే ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ పెద్ద హిట్టవ్వడం, ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా ఫస్టాఫ్ లో 3 బ్లాకులు, సెకెండాఫ్ లో 2 బ్లాకులు కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నాడు శ్రీవిష్ణు.

ఈ సినిమాతో పాటు.. వందే భారత్, లైన్ మ్యాన్, యమధీర, హద్దులేదురా అనే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిలో చెప్పుకోదగ్గ ఎట్రాక్షన్స్ లేవు. పెద్దగా ప్రచారం చేయకుండానే థియేటర్లలోకి వస్తున్నాయి ఈ మూవీస్. సో.. ఈవారం ఓం భీష్ బుష్ కు సినిమాకే కాస్త ఎడ్జ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా హిట్టవుతుంది.

ఇక ఈ వారం కూడా రీ-రిలీజెస్ హవా కనిపిస్తోంది. ఆల్రెడీ నువ్వు-నేను రిలీజైంది. రేపు 'ఈరోజుల్లో' అనే సినిమా వస్తోంది. మరో 3 రోజుల్లో నాయక్ సినిమా కూడా రీ-రిలీజ్ అవుతోంది.

First Published:  22 March 2024 2:30 AM GMT
Next Story