Telugu Global
Cinema & Entertainment

VeeraSimha Reddy: మరో పాటతో బాలయ్య రెడీ

VeeraSimha Reddy: బాలయ్య సినిమా నుంచి మరో పాట వస్తోంది. వీరసింహారెడ్డి నుంచి 4వ సాంగ్ ఇది. ఇదే చివరి లిరికల్ వీడియో కూడా.

VeeraSimha Reddy: మరో పాటతో బాలయ్య రెడీ
X

బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న సినిమా రాబోతోంది. ఈ నెల 6న ఒంగోలులో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.

అంతకంటే ముందు ఈ చిత్రంలోని నాల్గవ, చివరి పాట- మాస్ మొగుడు లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు ఈ లిరికల్ సాంగ్ వస్తోంది.

బాలకృష్ణ, శ్రుతి హాసన్ ల రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్ ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో రాయల్ గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్ లో గ్లామరస్ గా కనిపిస్తోంది. మాస్ మొగుడు సాంగ్ తమన్ మార్క్ మాస్ నంబర్‌ గా ఉండబోతోంది.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు.

First Published:  1 Jan 2023 1:00 PM GMT
Next Story