Telugu Global
Cinema & Entertainment

Dasara Movie - దసరా నుంచి మరో సింగిల్ రిలీజ్

Dasara Movie - దసరా మూవీ నుంచి మరో లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఇదే చివరి సాంగ్.

Dasara Movie - దసరా నుంచి మరో సింగిల్ రిలీజ్
X

నాని పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ విడుదలకు సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి.


సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ‘దసరా’ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. దూమ్ ధామ్, ఓరి వారి, చమ్కీల అంగీలేసి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దసరా నుంచి నాలుగో సింగిల్ ‘ఓ అమ్మలాలో’ పాటని విడుదల చేశారు మేకర్స్.


ధరణి, వెన్నెల అందమైన బాల్యాన్ని చూపిస్తూ మనసుని హత్తుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంతోష్ నారాయణ్. ఈ పాటకు రెహమాన్ అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాల్య మధుర స్మృతులని, మరపురాని జ్ఞాపకాలని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని హృద్యంగా ఆలపించారు.


కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రేపు గ్రాండ్ గా విడుదలౌతుంది దసరా.



First Published:  29 March 2023 1:57 PM GMT
Next Story