Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu - మహేష్ కోసం ముచ్చటగా 3 టైటిల్స్

Mahesh Trivikram Movie - మహేష్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో 3 టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu - మహేష్ కోసం ముచ్చటగా 3 టైటిల్స్
X

మహేష్ బాబు సినిమా నుంచి అప్ డేట్ వస్తుందంటే సందడి మామూలుగా ఉండదు. దాదాపు నెల రోజుల నుంచే హంగామా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే హంగామా నడుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీకి సంబంధించి కచ్చితంగా ఈనెల 31న అప్ డేట్ వస్తుందని అభిమానులకు తెలుసు.

కృష్ణ బర్త్ డేకి కచ్చితంగా అప్ డేట్ ఇస్తాడు మహేష్. ఈసారి వస్తున్నది కృష్ణ జయంతి. మరోవైపు త్రివిక్రమ్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. కాబట్టి కచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ఫ్యాన్స్ కు తెలుసు. ఇందులో భాగంగా 3 టైటిల్స్ సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఇందులో ఏ టైటిల్ పెడతారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఎక్కువమంది దృష్టి 'అమరావతికి అటుఇటు' అనే టైటిల్ పై ఉంది. మహేష్ కొత్త సినిమాకు ఇదే టైటిల్ పెట్టే అవకాశం ఉందంటున్నారు చాలామంది. మరికొంతమంది మాత్రం గుంటూరు కారం అనే టైటిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు చాన్నాళ్లుగా నలుగుతున్నాయి. తాజాగా ఊరికి మొనగాడు అనే టైటిల్ కూడా తెరపైకొచ్చింది.

అయితే ఇలా ఎన్ని టైటిల్స్ తెరపైకొచ్చినప్పటికీ, త్రివిక్రమ్ మనసులో ఏదో ఒక టైటిల్ ఉండే ఉంటుంది. దాన్ని ఆయన సెడన్ గా బయటపెడతాడు. ఇప్పుడు చెప్పుకుంటున్న టైటిల్స్ లో ఒకటి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.

First Published:  16 May 2023 11:48 AM GMT
Next Story