Telugu Global
Cinema & Entertainment

Skanda Movie | రామ్ సినిమా నుంచి మరో డాన్స్ నంబర్

Skanda Movie - రామ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ రిలీజైంది.

Skanda Movie | రామ్ సినిమా నుంచి మరో డాన్స్ నంబర్
X

సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత బోయపాటి శ్రీను, తమన్ మరోసారి కలిశారు. ఈసారి స్కంద సినిమా చేస్తున్నారు ఈ ఇద్దరు. వీళ్లకు ఇది హ్యాట్రిక్ మూవీ. రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజగా మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు.

తమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించాడు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ కాగా, గందారబాయి కూడా డాన్స్ నంబరే. కాకపోతే ఈసారి ఫోక్ బీట్ వచ్చింది. పాటలో నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను ఖరీదైన సెట్స్ లో చిత్రీకరించారు.

లిరికల్ వీడియోలో రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో అదరగొట్టారు. వీళ్లిద్దరి డాన్స్ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ నంబర్ కు కొరియోగ్రఫీ అందించాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

First Published:  18 Aug 2023 4:10 PM GMT
Next Story