Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari | రెండో పాటకు అంతా రెడీ

Balakrishna's Bhagavanth Kesari - బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా నుంచి సెకెండ్ సాంగ్ రెడీ అయింది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Bhagavanth Kesari | రెండో పాటకు అంతా రెడీ
X

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్రెష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. టీజర్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వరకు ప్రమోషనల్‌ మెటీరియల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా భగవంత్ కేసరి జర్నీ పేరిట విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడీ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రెడీ అయింది. ఉయ్యాలో ఉయ్యాలా అనే ఈ పాటను మరో 2 రోజుల్లో (అక్టోబర్ 4న) విడుదల చేయబోతున్నారు. ఈ పాట భగవంత్ కేసరితో ఓ చిన్నారికి ఉన్న బంధాన్ని చెబుతుంది. పోస్టర్‌ లో బాలకృష్ణ నది ఒడ్డున కూర్చుని పాపతో సరదాగా గడుపుతున్నట్లు ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలయ్యకు కూతురు వరుస పాత్రలో శ్రీలీల కనిపించనుంది. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడు ఇందులో విలన్ గా నటించాడు.

ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. భగవంత్ కేసరి దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానుంది.

First Published:  2 Oct 2023 8:16 AM GMT
Next Story