Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari | బాలకృష్ణ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్

Bhagavanth Kesari - బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా నుంచి రెండో పాట రిలీజ్ చేశారు. ఈ పాటలో చాలా ప్రత్యేకతలున్నాయి.

Bhagavanth Kesari | బాలకృష్ణ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్
X

‘భగవంత్ కేసరి’ సినిమా పాటల ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ సినిమా టీజర్, నందమూరి బాలకృష్ణను కంప్లీట్ మాస్, యాక్షన్ అవతార్‌లో ప్రెజెంట్ చేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కనిపించారు బాలకృష్ణ. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఫస్ట్ సింగిల్ గణేష్ పాట బాలకృష్ణ , శ్రీలీల మధ్య అందమైన బంధాన్ని చూపించింది. ఈ పాటలో శ్రీలీల, బాలకృష్ణను చిచ్చా అని పిలుస్తూ కనిపించింది. వారి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకర్షించాయి. తాజాగా రెండో సాంగ్ రిలీజైంది.

ఉయ్యాలో ఉయ్యాలా అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను తమన్ స్వరపరిచాడు. ఈ సాంగ్, భగవంత్ కేసరి ఎమోషన్ ని చూపించింది. యంగ్ శ్రీలీలతో బాలకృష్ణకు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఇది చూపిస్తుంది. తమన్ పర్ఫెక్ట్ సిట్యుయేషనల్ సాంగ్‌ను స్కోర్ చేశాడు. దీనికి అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగా కుదిరింది.

ఎస్పీ చరణ్ గాత్రం ఈ పాటకు మంచి ఆకర్షణ తెచ్చిపెట్టింది. తన గొంతుతో బాలసుబ్రమణ్యాన్ని మరోసారి గుర్తుచేశాడు చరణ్. బాలకృష్ణ, చిన్నారి ప్రయాణం చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఈసారి కేవలం లిరికల్ సాంగ్ కే పరిమితం కాకుండా.. ఆ పాటలో సన్నివేశాల్ని కూడా ఎక్కువగా చూపించారు. అలానే ఆన్ లొకేషన్ విజువల్స్ ను కూడా చూపించారు.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలకృష్ణ కూతురు వరుస పాత్రలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో విలన్ అతడే. భగవంత్ కేసరి దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానుంది.

First Published:  5 Oct 2023 2:35 AM GMT
Next Story