Telugu Global
Cinema & Entertainment

Bedurulanka | కార్తికేయ సినిమా నుంచి మరో సాంగ్

Karthikeya's Bedurulanka Movie | కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా బెదురులంక. ఈ మూవీ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజైంది.

Bedurulanka | కార్తికేయ సినిమా నుంచి మరో సాంగ్
X

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్ టైనర్ 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సినిమాలో రెండో పాట 'సొల్లుడా శివ'ను విడుదల చేశారు.

సొల్లుడా శివా... అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు.

ఈ సినిమా నుంచి ఇది రెండో పాట. మొదటి సాంగ్ గా రిలీజైన వెన్నెల్లో ఆడపిల్లకు ఓ మోస్తరు స్పందన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కంటెంట్ తో ఈ సినిమా వస్తోంది. గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుందని... గోదావరి బేస్డ్ రూరల్ డ్రామాగా 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అంటున్నాడు నిర్మాత బెన్నీ.

తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చెప్పారు. లిరికల్ వీడియోలో కార్తికేయ డ్యాన్సులు కూడా చూడొచ్చు. మణిశర్మ అందించిన సంగీతం క్యాచీగా ఉంది. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

First Published:  20 July 2023 8:54 AM GMT
Next Story