Telugu Global
Cinema & Entertainment

2018 Movie - 70శాతం అధికంగా వసూళ్లు

2018 Movie - ఊహించని విధంగా 2018 మూవీ పుంజుకుంది. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు 70శాతం వసూళ్లు పెరిగాయి.

2018 Movie - 70శాతం అధికంగా వసూళ్లు
X

కొన్ని సినిమాలకు పబ్లిసిటీ అక్కర్లేదు. కేవలం మౌత్ టాక్ తో సూపర్ హిట్ అవుతాయి. రీసెంట్ గా వచ్చిన ది కేరళ స్టోరీ అలాంటిదే. ఇప్పుడిదే కోవలోకి మరో మలయాళం సినిమా చేరబోతోంది. దాని పేరు 2018. తెలుగులో ఈ సినిమా సైలెంట్ హిట్ కొట్టింది.

కేరళలో అతి తక్కువ రోజుల్లో 100 కోట్లు షేర్ రాబట్టింది ఈ చిత్రం. అలా ఓ మోస్తరు అంచనాలతో, మే 26న తెలుగులో విడుదల అయింది. బన్నీ వాస్ రిలీజ్ చేసిన ఈ సినిమాకు రోజురోజుకు అనూహ్యంగా క్రేజ్ పెరుగుతోంది.

తెలుగులో విడుదల చేసిన మొదటిరోజు కోటి రూపాయలు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది 2018 మూవీ. ఇదే ఆశ్చర్యం అనుకుంటే, అంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండవ రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 శాతం వసూళ్లు పెరగడం విశేషం.

2 రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో వచ్చిన వరదల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, జాయ్ మాథ్యూ, తదితరులు నటించిన ఈ సినిమా మల్లూవుడ్ లో మరో మాస్టర్ పీస్ గా నిలిచింది.

First Published:  28 May 2023 12:03 PM GMT
Next Story