Telugu Global
Cinema & Entertainment

OTT Weekend - 2 ఫ్లాప్ సినిమాలు, ఒకేసారి ఓటీటీలోకి

2 Flop Movies OTT - ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, మీటర్ సినిమాలు ఈ అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి వస్తున్నాయి. ఆ డీటెయిల్స్ మీకోసం..

OTT Weekend - 2 ఫ్లాప్ సినిమాలు, ఒకేసారి ఓటీటీలోకి
X

నాగశౌర్య, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ రాత్రే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా మార్చి 17న విడుదలైంది, ఆ వెంటనే ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమాను ఈరోజు అర్థరాత్రి నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఈ చిత్రంలో మేఘా చౌదరి మరియు శ్రీనివాస్ అవసరాల కూడా నటించారు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించారు. ఒక యువ జంట, వారి జీవితంలోని వివిధ దశలలో వారి సంబంధం, ఎదుర్కొన్న సవాళ్లను ఈ చిత్రంలో సహజంగా చూపించే ప్రయత్నం చేశారు.

ఇక కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ మూవీ కూడా ఈరోజు రాత్రికే ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో పోలీస్ గా కనిపించాడు అబ్బవరం. ఈ చిత్రంలో అతుల్య రవి హీరోయిన్. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలైన ఈ సినిమాను చడీచప్పుడు కాకుండా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు.

రమేష్ కడూరి దర్శకత్వం వహించిన మీటర్ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. రవితేజ 'రావణాసుర'కి పోటీగా డైరెక్ట్‌గా విడుదలైంది. రావణాసురతో పాటు ఈ సినిమా కూడా పోయింది.

First Published:  4 May 2023 12:39 PM GMT
Next Story