Telugu Global
Cinema & Entertainment

Bhimaa | భీమా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Bhimaa Movie - గోపీచంద్ తాజా చిత్రం భీమా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

Bhimaa | భీమా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
X

మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. టీజర్ తో ఈ సినిమా అంచనాలు పెంచేసింది. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు.

టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను రెబల్ పోలీసుగా పరిచయం చేయడంపై దృష్టి పెట్టగా, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన 'ఎదో ఎదో మాయ' కంపొజింగ్ బాగుంది.

కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం, హీరో తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్‌గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది.

గోపీచంద్, మాళవిక జంట తెరపై బ్యూటీఫుల్ గా ఉంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ మరో హీరోయిన్. 'భీమా' మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రానుంది.

First Published:  9 Feb 2024 5:00 PM GMT
Next Story