Telugu Global
Cinema & Entertainment

Gangs of Godavari | విశ్వక్ సేన్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో

Gangs of Godavari Movie - విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న డిఫరెంట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.

Gangs of Godavari | విశ్వక్ సేన్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో
X

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా గా రూపొందుతోన్న సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన 'డీజే టిల్లు' చిత్రంతో ‘రాధిక’గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి ఈ చిత్రంలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకుడు, కథ కూడా అతడిదే. ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా మొదటి గీతం 'సుట్టంలా సూసి', అనే లిరికల్ వీడియోను ఈ రోజు విడుదల చేశారు.

అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ క్లాసికల్ మెలొడీ బాగుంది. శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలని నిర్ణయించారు.

First Published:  16 Aug 2023 3:37 PM GMT
Next Story