Telugu Global
Cinema & Entertainment

18 Pages Movie OTT Streaming: 18 పేజెస్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

18 Pages OTT Streaming date locked నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 18 పేజెస్. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

18 Pages Movie OTT Streaming: 18 పేజెస్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
X

థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు 18పేజెస్ సినిమా. కార్తికేయ-2 సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ను ఈ సినిమాతో కొంత పోగొట్టుకున్నాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పించారు.


థియేటర్లలో ఫెయిలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈనెల 27న ఆహాలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్ డేట్ ఏంటంటే, అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.


ఆహా, నెట్ ఫ్లిక్స్ మధ్య సినిమాల స్ట్రీమింగ్ కు సంబంధించి అవగాహన కుదిరింది. ఇప్పటికే భీమ్లానాయక్ లాంటి సినిమాల్ని ఇలా షేరింగ్ లో స్ట్రీమింగ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు 18-పేజెస్ ను కూడా అదే పద్ధతిలో స్ట్రీమింగ్ చేయబోతోంది.


థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాబట్టలేకపోయిన ఈ సినిమా, కనీసం ఓటీటీలోనైనా క్లిక్ అయితే నిఖిల్ హ్యాపీ. లేదంటే మరో సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే.

First Published:  16 Jan 2023 7:32 AM GMT
Next Story