Telugu Global
Business

వాట్సప్‌లో లింక్‌లతోనూ వాయిస్, వీడియో కాల్స్

వాట్సాప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే వీలు కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మార్క్ జుకెర్ బర్గ్ చెప్పారు. ఇందుకు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు.

వాట్సప్‌లో లింక్‌లతోనూ వాయిస్, వీడియో కాల్స్
X

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. వాట్సప్ మెసేజ్ యాప్‌లో ఇప్పటికే ఎన్నో ఫీచర్లు ఉండగా ఈ వారం నుంచి మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి వాట్సప్ వాయిస్ కాల్, వీడియో కాల్ లో జాయిన్ కావాలంటూ ఇతరులకు లింక్ సెండ్ చేసి ఆహ్వానం పలకవచ్చు.

వాట్సప్‌లో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఒకరికి లేదా అంత కంటే ఎక్కువ మందికి ఒకే సారి ఫోన్ చేయవచ్చు. అయితే ఎక్కువ మందికి ఒకేసారి కాల్ చేసినప్పుడు బిజీ వల్ల కొందరు లిఫ్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మరికొందరికి ఆసక్తి ఉండకపోవచ్చు. పని వేళల్లో కాల్ చేస్తే కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే వాట్సప్‌లో రానున్న ఈ రెండు కొత్త ఫీచర్ల ద్వారా వాట్సప్ వాయిస్ కాల్, వీడియో కాల్‌లో జాయిన్ కావాలంటూ ఒక లింక్ సెండ్ చేయవచ్చు.

ఆసక్తి ఉన్నవారు ఆ లింక్‌ని క్లిక్ చేసి కాల్‌లో జాయిన్ కావొచ్చు. బిజీగా ఉండి కాల్ చూసుకోలేకపోయినవారు తర్వాత ఆ లింక్ క్లిక్ చేసి కాల్‌లోకి యాడ్ కావొచ్చు. ఈ వాయిస్ లేదా, వీడియో కాల్ చేసేందుకు కాల్ సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ని క్రియేట్ చేసి దానిని ఇతరులకు సెండ్ చేయాల్సి ఉంటుంది.

ఈ రెండు ఫీచర్లు పొందడానికి ఇప్పటికే వాట్సప్ వాడుతున్నవారు యాప్‌ని ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం నుంచే ఈ రెండు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని వాట్సప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అలాగే వాట్సాప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే వీలు కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు.

First Published:  27 Sep 2022 8:15 AM GMT
Next Story