Telugu Global
Business

యూపీఐ పేమెంట్స్ రోజువారీ లిమిట్స్ తెలుసా?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. ఒక యూజర్ రోజులో యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసే వీలుంది.

యూపీఐ పేమెంట్స్ రోజువారీ లిమిట్స్ తెలుసా?
X

యూపీఐ పేమెంట్స్ రోజువారీ లిమిట్స్ తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే కనిపిస్తున్నాయి. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రభుత్వం కూడా యూపీఐ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తుంది. దేశంలో దాదాపు ప్రతిచోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యూపీఐ పేమెంట్స్‌కు కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. ఒక యూజర్ రోజులో యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసే వీలుంది. 24 గంటల్లో రూ.లక్ష కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్‌ను బ్యాంకులు కూడా అనుమతించవు.

ఇకపోతే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే లాంటి యాప్స్‌కు సెపరేట్‌గా రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉన్నాయి. అమెజాన్‌ పే యాప్ ద్వారా రోజులో రూ.లక్ష వరకు పేమెంట్స్‌ చేయొచ్చు. అలాగే రోజుకి 20 ట్రాన్సాక్షన్‌ల వరకూ చేసుకునే వీలుంది.

గూగుల్‌ పే యాప్ ద్వారా రోజులో రూ.లక్ష వరకూ పంపుకోవచ్చు. అలాగే ఒక రోజులో 10 ట్రాన్సాక్షన్‌ల వరకూ చేసుకోవచ్చు.

ఫోన్‌పే యాప్ కూడా రోజులో రూ.లక్షకు మించి పేమెంట్స్‌ను అనుమతించదు. అయితే ఇందులో డైలీ ట్రాన్సాక్షన్ల లిమిట్ లేదు. రూ.లక్ష విలువ దాటకుండా రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు.

పేటీఎం యూపీఐ విషయానికొస్తే.. రోజుకు రూ.లక్ష వరకూ పేమెంట్స్‌ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌ల విషయంలో లిమిట్ లేదు. రూ. లక్ష దాటకుండా రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినా చేసుకోవచ్చు.

First Published:  12 July 2023 12:26 PM GMT
Next Story