Telugu Global
Business

Toyota Urban Cruiser Taisor | మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్‌.. 3న లాంచింగ్‌..!

Toyota Urban Cruiser Taisor | మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్ బేస్డ్ టెక్నాల‌జీతో జ‌పాన్ కార్ల త‌యారీ సంస్థ టయోటా కిర్లోస్క‌ర్ మ‌రో కారు ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Toyota Urban Cruiser Taisor | మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్‌.. 3న లాంచింగ్‌..!
X

Toyota Urban Cruiser Taisor | మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్ బేస్డ్ టెక్నాల‌జీతో జ‌పాన్ కార్ల త‌యారీ సంస్థ టయోటా కిర్లోస్క‌ర్ మ‌రో కారు ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఇందుకోసం క్రూయిజ‌ర్ టైసోర్ (Urban Cruiser Taisor) అనే ట్రేడ్‌మార్క్ రిజిస్ట‌ర్ చేసుకుంది. వ‌చ్చేనెల‌లో మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న ట‌యోటా ఎస్‌యూవీ క్రూయిజ‌ర్ టైసోర్ కానున్న‌ది. టైసోర్ వ‌చ్చేనెల మూడో తేదీన ఆవిష్క‌రిస్తామ‌ని తెలుస్తోంది. టాటా పంచ్‌, మారుతి ఫ్రాంక్స్‌, హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌ల‌తో పోటీ ప‌డే స్మాల్ ఎస్‌యూవీ కారు ఇది. మారుతి సుజుకి, ట‌యోటా కిర్లోస్క‌ర్ మ‌ధ్య టెక్నాల‌జీ ట్రాన్స్‌ఫ‌ర్ ఒప్పందం ఉంది.

మారుతి సుజుకి టెక్నాల‌జీతో రూపుదిద్దుకున్న నాలుగో ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్ కారు ఇది. తొలుత మారుతి సుజుకి బ్రెజా టెక్నాల‌జీతో రూపుదిద్దుకున్న కారు అర్బ‌న్ క్రూయిజ‌ర్ ఎస్‌యూవీ. కాక‌పోతే మార్కెట్ నుంచి క్రూయిజ‌ర్‌ను ట‌యోటా డిస్‌కంటిన్యూ చేసింది. మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ నుంచి ట‌యోటా రూమియ‌న్‌, మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్ నుంచి ట‌యోటా గ్లాన్జా డిజైన్ చేశారు.

మారుతి సుజుకి బాలెనో బేస్డ్‌గా రూపుదిద్దుకున్న‌దే మారుతి ఫ్రాంక్స్‌. ఎస్‌యూవీ ఇన్‌స్పైర్డ్ స్టైలింగ్‌, ఫీచ‌ర్ల‌తో ఫ్రాంక్స్ వ‌చ్చింది.నేమ్ బ్యాడ్జి మిన‌హా మారుతి ఫ్రాంక్స్‌లో ఫీచ‌ర్ల‌న్నీ ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్‌లో ఉంటాయి. గ్రిల్లె, బంప‌ర్‌, అల్లాయ్ వీల్స్ డిజైన్స్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటాయి.

మారుతి ఫ్రాంక్స్ మాదిరిగానే అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్ ఇంటీరియ‌ర్ ఫీచ‌ర్లు ఉంటాయి. మారుతి ఎస్‌యూవీ ఫ్రాంక్స్ 9-అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, 360-డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, లెద‌ర్ రాప్డ్ స్టీరింగ్ వీల్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ కోసం ఫ్రాంక్స్‌లో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీడీ విత్ ఈబీడీ, హిల్ అసిస్ట్‌, రేర్ పార్కింగ్ సెన్స‌ర్స్ ఉంటాయి.

ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్ 1.0-లీట‌ర్ల బూస్ట‌ర్ జెట్ టర్బో పెట్రోల్, 1.2 లీట‌ర్ల నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ల‌తో వ‌స్తుంది. 1.0 లీట‌ర్ల బూస్ట‌ర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 బీహెచ్‌పీ విద్యుత్‌, 147 ఎన్ఎం టార్క్‌, మారుతి సుజుకి స్మార్ట్ హైబ్రీడ్ సిస్ట‌మ్ గ‌ల 1.2 లీట‌ర్ల నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88 బీహెచ్‌పీ విద్యుత్ వెలువ‌రిస్తుంది. అర్బ‌న్ క్రూయిజ‌ర్ టైసోర్ విత్ హైబ్రీడ్ ప‌వ‌ర్ ట్రైన్ వేరియంట్ కూడా మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 5-స్పీడ్ ఏఎంటీ, 6-స్పీడ్ టార్క్ క‌న్వ‌ర్ట‌ర్ వ‌ర్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది.

First Published:  18 March 2024 8:42 AM GMT
Next Story