Telugu Global
Business

కొలీగ్స్‌తో ఇబ్బందులా? ఇలా నడుచుకుంటే సరి!

ఆఫీసులో పనిచేసేటప్పుడు అందరితో సఖ్యతగా ఉంటేనే వర్క్ లైఫ్ సాఫీగా సాగుతుంది. అలాకాకుండా కొలీగ్స్‌తో తరచూ మనస్ఫర్ధలు వస్తూ ఉంటే దానివల్ల ప్రశాతంత లోపిస్తుంది. అయితే పనిచేసే చోట రకరకాల మనస్తత్వాల వాళ్లు ఉండొచ్చు.

కొలీగ్స్‌తో ఇబ్బందులా? ఇలా నడుచుకుంటే సరి!
X

ఆఫీసులో పనిచేసేటప్పుడు అందరితో సఖ్యతగా ఉంటేనే వర్క్ లైఫ్ సాఫీగా సాగుతుంది. అలాకాకుండా కొలీగ్స్‌తో తరచూ మనస్ఫర్ధలు వస్తూ ఉంటే దానివల్ల ప్రశాతంత లోపిస్తుంది. అయితే పనిచేసే చోట రకరకాల మనస్తత్వాల వాళ్లు ఉండొచ్చు. మరి వారితో వేగెదెలా?

వర్క్ లైఫ్ ఆనందంగా సాగిపోవాలంటే తోటి కొలీగ్స్‌తో నడుచుకునే విధానాన్ని మార్చుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. వీలైనంత వరకూ అందర్నీ స్నేహితులుగా కలుపుకుపోతే ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ నెగెటివ్ పర్సన్స్ ఎదురైనప్పుడు వారితో కూడా ఫ్రెండ్లీగా నడుచుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

పని చేసే చోట అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఒకవేళ మీకు నచ్చనివారున్నారని లేదా బాస్ మనస్తత్వం మీకు నచ్చట్లేదని పని మీద కోపం తెచ్చుకోవడం, కంపెనీ మారడం వంటివి చేయకూడదు. ముందుగా వర్క్ లైఫ్‌లో ప్రొఫెషనల్‌గా నడుచుకోవడం నేర్చుకోవాలి. అప్పటికీ కుదరకపోతే అప్పుడు వేరొక డెసిషన్ తీసుకోవచ్చు.

పనిచేసేచోట పర్సనల్ విషయాలు ప్రస్తావన ఎంత తక్కువగా ఉంటే బిహేవియర్ అంత ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఒకవేళ అవతలి వాళ్లు తమ పర్సనల్ విషయాలు పంచుకున్నా దాన్ని మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం మంచిది. వర్క్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని సెపరేట్‌గా చూడడం అలవాటు చేసుకుంటే వర్క్ లైఫ్‌లో ఇబ్బందులు ఉండవు.

ఆఫీసులో ఉన్నంతసేపూ పని మీదే పూర్తి ఫోకస్ ఉండేలా చూసుకోవాలి. కొలీగ్స్‌తో ఉండే రిలేషన్స్ కూడా పనికి సంబంధించినవై ఉండాలి. టీమ్‌గా పని చేయడం, టాస్క్‌పై ఫోకస్ చేయడం ద్వారా కొలీగ్స్‌తో అభిప్రాయబేధాలు రాకుండా ఉంటాయి.

ఆఫీసులోని ఏదైనా కారణం చేత కొలీగ్‌తో గొడవైనప్పుడు దాన్ని పర్సనల్‌గా తీసుకోకూడదు. వారిని పూర్తిగా అవాయిడ్ చేయడం ప్రొఫషనలిజం అనిపించుకోదు. కాబట్టి వాళ్లు నచ్చినా, నచ్చకపోయినా పని విషయాలకై వారితో కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి.

పనిచేసే చోట ప్రతి ఒక్కర్నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ధోరణి అలవాటు చేసుకుంటే కొలీగ్స్‌పై నెగెటివ్ ఇంప్రెషన్స్‌ కలగకపోగా కెరీర్‌‌లో మరింత వేగంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా కొలీగ్స్‌పై మీకుండే అభిప్రాయాలను ఇతర కొలీగ్స్‌తో పంచుకోకూడదు. దీనివల్ల మరిన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. వీటి వల్ల ఆఫీసులో గ్రూపులు కట్టడం, పాలిటిక్స్ చేయడం వంటివి మొదలవుతాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

First Published:  24 April 2024 5:07 AM GMT
Next Story