Telugu Global
Business

Ethanol | పెట్రోల్‌కు ఆల్ట‌ర్నేటివ్ ఇథ‌నాల్.. త‌యారీ.. ఉప‌యోగాలిలా..!

Ethonol | ప్ర‌పంచంలోకెల్లా 100% ఇథ‌నాల్‌తో న‌డిపే కారు `ట‌యోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross)` కేంద్ర ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల‌శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Union Minister Nitin Gadkari) ఆవిష్క‌రించారు.

Ethanol | పెట్రోల్‌కు ఆల్ట‌ర్నేటివ్ ఇథ‌నాల్.. త‌యారీ.. ఉప‌యోగాలిలా..!
X

Ethanol | పెట్రోల్‌కు ఆల్ట‌ర్నేటివ్ ఇథ‌నాల్.. త‌యారీ.. ఉప‌యోగాలిలా..!

Ethanol| ప్ర‌పంచంలోకెల్లా 100% ఇథ‌నాల్‌తో న‌డిపే కారు `ట‌యోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross)` కేంద్ర ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల‌శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Union Minister Nitin Gadkari) ఆవిష్క‌రించారు. పెట్రోల్ / డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోతున్న‌ వాయు కాలుష్యంతో యావ‌త్ ప్ర‌పంచం ఆల్ట‌ర్నేటివ్ ఇంధ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఎల‌క్ట్రిక్‌, సీఎన్జీ, ఇథ‌నాల్‌, బ‌యో ఫ్యుయ‌ల్‌, హైడ్రోజ‌న్ వంటి కాంబినేష‌న్ ఇంధ‌నాల వైపు దృష్టి మ‌ళ్లింది. ఆ క్ర‌మంలో భాగంగా 100% ఇథ‌నాల్ వినియోగంతో రూపుదిద్దుకున్న ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) ఆవిష్క‌రించారు.

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ గ్యాస్ కంటే ఇథ‌నాల్ (Ethanol), బ‌యో గ్యాస్ (Bio Gas), బ‌యో ఫ్యూయ‌ల్ (Bio Fuel), ఎల‌క్ట్రికిసిటీ (Electricity) చౌక. మ‌రి ఇథ‌నాల్ ఎలా త‌యారు చేస్తారు. చెర‌కు నుంచి చక్కెర ఉత్ప‌త్తి చేస్తున్న‌ప్పుడు వ‌చ్చే ర‌సాయ‌నం నుంచి ఇథ‌నాల్ త‌యార‌వుతుంది. మొక్క‌జొన్న‌, కుళ్లిన బంగాళాదుంప‌లు, కుళ్లిన కూర‌గాయ‌లు, కంధ‌గ‌డ్డ‌లు, పులియ‌బెట్టిన బియ్యం పిండి నుంచి ఇథనాల్ త‌యారు చేయొచ్చు.


ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఇథ‌నాల్: చెరకు రసం, తీపి దుంప, కుళ్లిన బంగాళదుంపలు, తీపి జొన్న, మొక్కజొన్న పిండి నుంచి ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఇథ‌నాల్ త‌యారు చేస్తారు.

సెకండ్ జ‌న‌రేష‌న్ ఇథ‌నాల్: మొల‌క‌లు, ప‌చ్చి బ‌ఠానీల వంటి ఆకుప‌చ్చ‌ని కూర‌గాయల నుంచి వ‌చ్చే సెల్యూలోజ్‌, లిగ్నోసెల్యులోసిక్ పదార్థాల నుంచి సెకండ్ జ‌న‌రేష‌న్ ఇథ‌నాల్ ఉత్ప‌త్తి చేయొచ్చు. ఇంకా వరి పొట్టు, గోధుమ పొట్టు, మొక్కజొన్న, వెదురు, క‌ల‌ప పొట్టు నుంచి కూడా ఇథ‌నాల్ తయారు చేయొచ్చు.



థ‌ర్డ్ జన‌రేష‌న్ ఇథ‌నాల్: చెరువులు, కుంట‌ల్లో త‌యారయ్యే సిల్మ‌ద్ర‌లను ప్రాసెసింగ్ చేసి బ‌యోమాస్ సేక‌రించాలి. అలా ప్రాసెస్ చేసిన సిల్మ‌ద్ర‌ల‌తో బ‌యో డీజిల్ రూపుదిద్దుకున్న‌ది.

పెట్రోల్‌తో పోలిస్తే ఇథ‌నాల్ ఇంధ‌న వ్య‌యం చౌక‌. ప్ర‌స్తుతం లీట‌ర్ ఇథ‌నాల్ ధ‌ర సుమారు రూ.60. లీట‌ర్ పెట్రోల్ రూ.109 ప్ల‌స్ జీఎస్టీ. లీట‌ర్ ఇథ‌నాల్‌తో 15-20 కి.మీ మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ మిక్సింగ్ చేసిన ఇథ‌నాల్‌తో వాయు కాలుష్యం త‌గ్గించ‌డానికి వీలు క‌లుగుతుంది. పెట్రోల్‌తో పోలిస్తే పెట్రోల్ మిక్సింగ్ ఇథ‌నాల్ వాడకంతో 35 శాతం కార్బ‌న్ మొనాక్సైడ్ త‌గ్గుతుంది. స‌ల్ఫ‌ర్ డ‌యాక్సైడ్‌, హైడ్రో కార్బ‌న్స్ కూడా త‌గ్గించగ‌లుగుతుంది. ఇథ‌నాల్‌లో ఉండే 35 శాతం ఆక్సిజ‌న్‌తో నైట్రోజ‌న్ ఆక్సైడ్‌ల‌ను త‌గ్గిస్తుంది.

ఇథ‌నాల్‌, ఇథ‌నాల్ మిక్సింగ్ పెట్రోల్ వాడ‌కంతో వాహ‌నం ఇంజిన్ లైఫ్ మెరుగు ప‌డుతుంది. ఇథ‌నాల్ వాడ‌కంతో రైతుల ఆదాయం పెరుగుతుంది. చక్కెర మిల్లులకు నూత‌న ఆదాయం మార్గం మెరుగవుతుంది. ఇథ‌నాల్‌తో రైతుల‌కు అధికంగా రూ.21 వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది.


ఇథ‌నాల్ వాడ‌కం పెర‌గ‌డం వ‌ల్ల దేశీయ అవ‌స‌రాల కోసం పెట్రోలియం దిగుమ‌తి వ్య‌యం ఆదా అవుతుంది. పెట్రోల్ దిగుమ‌తి కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వ ఖ‌జానాకు ప్ర‌తి ఏటా రూ.16 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఇథ‌నాల్ వాడ‌కంతో పెట్రోల్ దిగుమ‌తి వ‌ల్ల జ‌రిగే ఖ‌ర్చు పూర్తిగా ఆదా అవుతుంది. ఇంధ‌న రంగంలో స్వావ‌లంభ‌న సాధించ‌గ‌లుగుతాం.

100% ఇథ‌నాల్‌తో న‌డిచే టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును ఆవిష్క‌రించిన కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ పంపులు ఉన్నాయ‌ని, కానీ ఇథ‌నాల్ బంకుల్లేవంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ బంకుల మాదిరిగా ఇథ‌నాల్ బంకులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరీని కోరారు. ఈ కారులో వాడే ఇథ‌నాల్‌తో 40 శాతం విద్యుత్ ఉత్ప‌త్త‌వుతుంది. ఇప్పటికే దేశంలో టయోటా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్లు తయారు చేస్తున్నాయి.



First Published:  30 Aug 2023 7:40 AM GMT
Next Story