Telugu Global
Business

కొత్త ఏడాదిలో రాబోతున్న కొత్త ఫోన్లు ఇవే!

2024 జనవరిలో న్యూ ఇయర్ సందర్భంగా శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షావోమీ, వివో వంటి టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్‌ను రిలీజ్ చేయనున్నాయి.

కొత్త ఏడాదిలో రాబోతున్న కొత్త ఫోన్లు ఇవే!
X

న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. వచ్చే జనవరిలో పాపులర్ మొబైల్ బ్రాండ్స్ నుంచి కొన్ని లేటెస్ట్ మొబైల్ సిరీస్‌లు లాంఛ్ అవ్వనున్నాయి.

2024 జనవరిలో న్యూ ఇయర్ సందర్భంగా శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షావోమీ, వివో వంటి టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్‌ను రిలీజ్ చేయనున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

వన్‌ప్లస్‌ 12 సిరీస్

జనవరిలో వన్‌ప్లస్‌ బ్రాండ్ నుంచి వన్‌ప్లస్ 12 సిరీస్ రాబోతోంది. ఇందులో భాగంగా ‘వన్‌ప్లస్‌ 12’, ‘వన్‌ప్లస్‌ 12ఆర్‌’ మోడల్స్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డీ-ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉంటుంది. వీటిలో 24జీబీ ర్యామ్‌, 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.

వన్‌ప్లస్‌ 12లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, వన్‌ప్లస్ 12ఆర్‌‌లో స్నా్ప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్లు ఉంటాయి. వన్‌ప్లస్ 12లో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 ప్రైమరీ లెన్స్, 64ఎంపీ టెలిఫోటో లెన్స్, 48ఎంపీఅల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. వన్‌ప్లస్‌12 ఆర్‌‌లో 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ సెన్సర్లు కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.



శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్

వచ్చే ఏడాది జనవరిలో శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 24, ఎస్ 24 ప్లస్, ఎస్ 24 అల్ట్రా మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. ‘ఎస్ 24’ మోడల్‌లో 6.2 ఇంచెస్, ‘ఎస్ 24 ప్లస్’, ‘ఎస్ 24 అల్ట్రా’ మోడల్స్‌లో 6.8 ఇంచెస్ అమోలెడ్ స్క్రీన్ డిస్‌ప్లేలు ఉంటాయి. ‘ఎస్‌24’లో 50ఎంపీ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, ‘అల్ట్రా’, ‘ప్లస్’ మోడల్స్‌లో 200 ఎంపీ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. వీటిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా ఎగ్జినోస్ 2400ఎస్‌ఓసీ ప్రాసెసర్ ఉండొచ్చు.

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్

వచ్చే జనవరిలో షావోమీ బ్రాండ్ కు చెందిన రెడ్‌మీ నుంచి రెడ్ మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. ఈ సిరీస్ లో ‘రెడ్‌మీ నోట్‌ 13’, ‘రెడ్‌మీ నోట్‌ 13 ప్రో’, ‘రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌’ అనే మూడు మోడళ్లు ఉంటాయి. వీటిలో 6.6 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ‘నోట్‌ 13’లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, ‘నోట్ ప్రో’ మోడల్ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్‌వోసీ ప్రాసెసర్, ‘నోట్ ప్రో ప్లస్‌’ మోడల్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఎస్‌వోసీ ప్రాసెసర్‌‌లు ఉండనున్నాయి. ‘నోట్‌ 13’లో100ఎంపీ సెన్సర్‌‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, ‘నోట్ ప్రో’ మోడల్స్‌లో 200ఎంపీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉండనున్నాయి.



వివో ఎక్స్‌100 సిరీస్

వచ్చే ఏడాది జనవరిలో రానున్న మరో సిరీస్ ‘వివో ఎక్స్ 100’. ఈ సిరీస్‌లో భాగంగా ‘వివో ఎక్స్‌100’, ‘వివో ఎక్స్‌100 ప్రో’ మోడల్స్ లాంచ్ అవ్వనున్నాయి. వీటిలో 6.7 ఇంచెస్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. వీటిలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మోడల్‌ను బట్టి ఇతర ఫీచర్ల విషయంలో కొన్ని మార్పులుండొచ్చు.



ఐకూ నియో 9 ప్రో

వచ్చేనెలలో ఐకూ నుంచి ‘ఐకూ నియో 9 ప్రో’ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.7 ఇంచెస్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.

First Published:  24 Dec 2023 7:40 AM GMT
Next Story