Telugu Global
Business

నేడు (31-12-2022) మళ్లీ పెరిగిన బంగారం ధర..

ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,350కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930గా ఉంది.

నేడు (31-12-2022) మళ్లీ పెరిగిన బంగారం ధర..
X

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో రోజురోజుకూ పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. నిన్నటి నుంచి తిరిగి బంగారం పరుగు ప్రారంభించింది. నిన్న స్వల్పంగానే పెరిగినప్పటికీ నేడు మాత్రం కాస్త ఎక్కువగానే పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,350కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930గా ఉంది. మరోవైపు వెండి ధర సైతం బాగానే పెరిగింది. కిలో వెండిపై రూ.1000 పెరగడం గమనార్హం. నేడు కిలో వెండి ధర రూ. 71,300కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.50,350.. రూ.54,930

విజయవాడలో రూ.50,350.. రూ.54,930

విశాఖపట్నంలో రూ.50,350.. రూ.54,930

బెంగళూరులో రూ.50,400.. రూ.54,980

చెన్నైలో రూ.51,140.. రూ.55,790

ఢిల్లీలో రూ.50,500.. రూ.55,080

ముంబైలో రూ.50,350.. రూ.54,930

కోల్‌కతాలో రూ.50,350.. రూ.54,930

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,500

విజయవాడలో రూ. 74,500

విశాఖపట్నంలో రూ. 74,500

చెన్నైలో రూ. 74,500

బెంగుళూరులో రూ. 74,500

కేరళలో రూ. 74,500

కోల్‌కతాలో రూ. 71,300

న్యూఢిల్లీలో రూ. 71,300

ముంబైలో రూ. 71,300

First Published:  31 Dec 2022 3:08 AM GMT
Next Story