Telugu Global
Business

ఫెస్టివల్ సేల్‌లో కొనాల్సిన బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రస్తుతం ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో మొబైల్స్‌తో పాటు రకరకాల గ్యాడ్జెట్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

ఫెస్టివల్ సేల్‌లో కొనాల్సిన బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే..
X

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రస్తుతం ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో మొబైల్స్‌తో పాటు రకరకాల గ్యాడ్జెట్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ డీల్స్ ఇవే..

ఎక్స్‌బాక్స్ సిరీస్

గేమింగ్ కన్సోల్‌ను కొనాలనుకునేవారికి ఎక్స్‌బాక్స్ సిరీస్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్‌ను రూ. 25,990కే కొనుగోలు చేయొచ్చు.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో

వన్‌ప్లస్ బడ్స్ ప్రో ప్రస్తుతం భారీ డిస్కౌంటుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్ బడ్స్‌ అసలు ధర రూ.9,990. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో వీటిని రూ.6,490కే కొనుగోలు చేయొచ్చు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీయస్ 55 రేటింగ్ లాంటి ఫీచర్లున్నాయి.

అమెజాన్ ఎకో డాట్

అమెజాన్ తమ అలెక్సా స్మార్ట్ స్పీకర్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తోంది. వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే ఈ స్మార్ట్ స్పీకర్ తక్కువ ధరలో రూ. 1,599 కే లభిస్తోంది. దీంతో పాటు విప్రో 9వాట్స్ ఎల్‌ఈడీ స్మార్ట్ బల్బ్ కూడా ఉచితంగా అందిస్తోంది.

అమెజాన్ కిండిల్

ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదివేందుకు అమెజాన్ తయారు చేసిన కిండిల్ డివైజ్ ప్రస్తుతం సేల్‌లో రూ.6,499కే లభిస్తోంది. ఇది డిజిటల్ స్క్రీన్‌లా కాకుండా నిజమైన పేపర్‌‌లా ఉంటుంది. ఇందులో ఈబుక్స్ చదువుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువే.

ఎమ్ ఐ ప్యాడ్ 5

షావోమీ నుంచి విడుదలైన బడ్జెట్ ప్యాడ్ ఇది. ఇది డాల్బీ విజన్‌తో 120హెర్ట్స్, 10.95-అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. డాల్బీ అట్మోస్‌కు సౌండ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 24,999కి అందుబాటులో ఉంది.

అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ

అమెజాన్‌ బేసిక్స్‌ 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై ఏకంగా 63 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 27,000 కాగా ప్రస్తుతం సేల్‌లో రూ.9,999కే అందుబాటులో ఉంది. కొన్ని క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది అన్ని ఓటీటీలను సపోర్ట్ చేస్తుంది.

ఎమ్‌ఐ 5ఏ ఎల్‌ఈడీ టీవీ

షావోమీ తమ 5ఏ సిరీస్ స్మార్ట్‌ టీవీపై 56 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 24,999కాగా ఆఫర్‌లో రూ. 10,990కే లభిస్తోంది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

First Published:  29 Sep 2022 1:30 AM GMT
Next Story