Telugu Global
Business

ఆ చీర ధర అక్షరాల రూ.18 లక్షలు!

20 తులాల బంగారంతో చీర నేసిన సిరిసిల్ల నేతన్న

ఆ చీర ధర అక్షరాల రూ.18 లక్షలు!
X

పెళ్లికో.. ఇంకా ఏదైనా శుభకార్యాలకో కొనే చీరల ధర ఎంతుంటుంది? కొనే వాళ్ల తాహతును బట్టి రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉండొచ్చు. ఇంకా రిచ్‌ లుక్‌ లో మెరిసిపోవాలంటే నాలుగైదో లక్షలు పెట్టి కొనుగోలు చేయవచ్చు.. గోల్డెన్‌ మగ్గం వర్క్‌ తో రిచ్‌ గా బ్లాజ్‌ ను డెకరేట్‌ చేసేందుకు రూ. లక్షలు ఖర్చు చేయవచ్చు. కానీ తన బిడ్డ పెళ్లి కోసం ఒకరు రూ.18 లక్షలతో చీర తయారు చేయించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారులు నల్లా విజయ్‌ కుమార్‌ ఈ చీరను నేశారు. 20 తులాల బంగారంతో నేసిన ఈ చీర ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌ కు చెందిన ఒక వ్యాపారవేత్త తన కుమార్తె వివాహం కోసం బంగారంతో చీర తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్‌ ఇచ్చారు. అక్టోబర్‌ 17 ఆ యువతి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. మీటర్‌ 9 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో నేసిన చీర సుమారు 900 గ్రాములు ఉంటుందని నల్లా విజయ్‌ కుమార్‌ తెలిపారు.

First Published:  28 Sept 2024 12:45 PM GMT
Next Story