Telugu Global
Business

TCS - Tata Sons | టీసీఎస్‌లో టాటా స‌న్స్ వాటా విక్ర‌యం.. టీసీఎస్ వాటా మూడు శాతం డౌన్‌..!

TCS - Tata Sons | దేశంలోనే ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ టాటా స‌న్స్ (Tata Sons) త‌న అనుబంధ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్-టీసీఎస్ (Tata Consultancy Services -TCS)లో త‌న వాటా 0.65 శాతం వాటా విక్ర‌యించి దాదాపు 1.13 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

TCS - Tata Sons | టీసీఎస్‌లో టాటా స‌న్స్ వాటా విక్ర‌యం.. టీసీఎస్ వాటా మూడు శాతం డౌన్‌..!
X

TCS - Tata Sons | దేశంలోనే ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ టాటా స‌న్స్ (Tata Sons) త‌న అనుబంధ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్-టీసీఎస్ (Tata Consultancy Services -TCS)లో త‌న వాటా 0.65 శాతం వాటా విక్ర‌యించి దాదాపు 1.13 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. టీసీఎస్ షేర్ విలువ స‌గటున రూ.4,043 చొప్పున సుమారు రూ.9,000 కోట్ల నిధులు సేక‌రించాల‌ని టాటా స‌న్స్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

దీంతో మంగ‌ళ‌వారం బీఎస్ఈలో షేర్ మూడు శాతం ప‌త‌న‌మై రూ.4,021ల‌కు ప‌డిపోయింది. సోమ‌వారం స్టాక్ మార్కెట్ల‌లో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) షేర్ ముగింపు విలువలో 3.65 శాతం డిస్కౌంట్‌తో రూ.4001 ప్రకారం 2.34 కోట్ల షేర్లు విక్ర‌యిస్తామ‌ని తెలిపింది. ఈ ప్ర‌క్రియ నిర్వ‌హ‌ణ‌కు జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ బ్యాంకులను టాటా స‌న్స్ నియ‌మించింది. మంగ‌ళ‌వారం స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడింగ్ ముగిసిన త‌ర్వాత టీసీఎస్‌లో టాటా షేర్ల విక్ర‌య ఒప్పందం వివ‌రాలు ఖ‌రార‌వుతాయి.

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ టీసీఎస్‌లో టాటా స‌న్స్‌కు 72.38 శాతం వాటా ఉంటుంది. రూ.14.6 ల‌క్ష‌ల కోట్ల‌తో దేశంలోనే అత్యంత విలువైన మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ గ‌ల రెండో సంస్థ‌గా నిలిచింది. టీసీఎస్‌లో టాటా స‌న్స్ వాటా ఎంత అన్న‌ది అధికారిక స‌మాచారం లేదు. టాటా స‌న్స్ సంస్థ‌కు ఉన్న రుణాలు.. ఆ సంస్థ ఐపీఓకు వెళ్ల‌డానికి ఆటంకంగా ఉన్నాయి. ఆర్బీఐ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఐపీఓకు వెళ్ల‌డం కోసం టాటా స‌న్స్ ఈ వాటాల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్‌కు మిన‌హాయింపు ఇవ్వాలంటే ఇత‌ర కంపెనీల నుంచి ఇవే డిమాండ్లు వ‌స్తాయ‌ని ఆర్బీఐ అభ్యంత‌రం పెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీనిపై ప‌రిష్కార మార్గం కోసం టాటా స‌న్స్ న్యాయ‌, ఆర్థిక నిపుణుల సూచ‌న‌ల మేర‌కు టీసీఎస్‌లో టాటా స‌న్స్ త‌న వాటాను విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం. టాటా స‌న్స్ (Tata Sons) కు రూ.20 వేల‌కు పైగా రుణాలు ఉన్నాయి. ఈ రుణాల‌ను రూ.100 కోట్ల‌కు ప‌రిమితం చేస్తే ఆర్బీఐ సీఐసీ నిబంధ‌న కింద స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్‌కు ఇబ్బందులు ఉండ‌వ‌ని భావిస్తున్నారు.

టాటా స‌న్స్‌లో దొరాబ్జీ టాటా టాటా ట్రస్ట్‌కు 28 శాతం, ర‌త‌న్‌టాటా ట్ర‌స్ట్‌కు 24 శాతం వాటా ఉంటాయి. ఈ రెండు ట్ర‌స్ట్‌ల‌తోపాటు స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌, సైర‌స్ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌, టాటా మోటార్స్‌, టాటా కెమిక‌ల్స్‌, టాటా ప‌వ‌ర్ సంస్థ‌లు వాటాదారులుగా ఉన్నాయి. టాటా స‌న్స్ సంస్థ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.30 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. టాటా స‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో టీసీఎస్ వాటా స‌గం ఉంటుంద‌ని అంచ‌నా.

First Published:  19 March 2024 8:16 AM GMT
Next Story