Telugu Global
Business

Tata Motors | ప్రీమియం ఎస్‌యూవీలకు ప‌వ‌ర్‌ట్రైన్ పెట్రోల్ ఇంజిన్‌.. టాటా మోటార్స్ టార్గెట్ ఇదే..!

Tata Motors | హారియ‌ర్‌, స‌ఫారీ వంటి ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ కోసం టాటా మోటార్స్ న్యూ పెట్రోల్ ప‌వ‌ర్‌ట్రైన్ ఇంజిన్ అభివృద్ధి చేస్తున్న‌ది.

Tata Motors | ప్రీమియం ఎస్‌యూవీలకు ప‌వ‌ర్‌ట్రైన్ పెట్రోల్ ఇంజిన్‌.. టాటా మోటార్స్ టార్గెట్ ఇదే..!
X

Tata Motors | హారియ‌ర్‌, స‌ఫారీ వంటి ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ కోసం టాటా మోటార్స్ న్యూ పెట్రోల్ ప‌వ‌ర్‌ట్రైన్ ఇంజిన్ అభివృద్ధి చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం టాటా ఎస్‌యూవీ కార్ల‌లో 2-లీట‌ర్ల డీజిల్ ఇంజిన్లు వినియోగిస్తున్నారు. తాము డెవ‌ల‌ప్ చేస్తున్న పెట్రోల్ ఇంజిన్‌.. హారియ‌ర్‌, స‌ఫారీ మోడ‌ల్ కార్ల‌లో వినియోగిస్తామ‌ని పీటీఐ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శైలేష్ చంద్ర చెప్పారు.

ప్ర‌తియేటా విక్ర‌యాలు సాగే రెండు ల‌క్ష‌ల కార్లలో 80 శాతం వాహ‌నాల్లో డీజిల్ ప‌వ‌ర్‌ట్రైన్ త‌యారు చేయ‌డంపైనే టాటా మోటార్స్ దృష్టి పెట్టింద‌న్నారు శైలేష్ చంద్ర‌. కార్ల వినియోగ‌దారులు ప్రాథ‌మికంగా మెరుగైన టార్క్ పెర్ఫార్మెన్స్ కోసం డీజిల్ వినియోగ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతుంటార‌న్నారు. అందుకే టాటా మోటార్స్ ఎల్ల‌వేళ‌లా డీజిల్ వాహ‌నాల‌పై దృష్టి పెడుతుంద‌ని తేల్చి చెప్పారు.

పెట్రోల్ వినియోగ కార్ల దిశ‌గా అంతా అడుగులేస్తున్నార‌న్న సంగ‌తి మాకు తెలుసు. ఆయా మోడ‌ల్స్‌ను బ‌ట్టి అధిక ధ‌ర‌లు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకే మిగ‌తా 20 శాతం మార్కెట్ కోసం 1.5 లీట‌ర్ల జీడీఐ ఇంజిన్ త‌యారీపై దృష్టి పెట్టాం అని శైలేష్ చంద్రా చెప్పారు.

స‌రైన అభివృద్ధితో ఇంటిగ్రేటెడ్‌ కారు పెట్రోల్ ఇంజిన్ త‌యారు చేయాల్సి ఉంది. మా ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంది. స‌ద‌రు ఇంజిన్ కెపాసిటీ పెంచ‌డంపై ప‌ని చేస్తున్నాం. పెట్రోల్ ఇంజిన్ పొంద‌డానికి కొంత దూరం ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. కానీ పెట్రోల్ ఇంజిన్ తీసుకొస్తాం అని శైలేష్ చంద్ర వెల్ల‌డించారు. గ‌త వారం టాటా మోటార్స్.. టాటా హారియ‌ర్ (రూ.15.49 ల‌క్ష‌లు), టాటా స‌ఫారీ (రూ.16.19 ల‌క్ష‌లు) న్యూ వ‌ర్ష‌న్ ఆవిష్క‌రించింది. వెహిక‌ల్ సేఫ్టీ గ్రూప్ గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్‌ నుంచి హారియ‌ర్‌, స‌ఫారీ టాప్ సేఫ్టీ రేటింగ్స్ పొందాయి కూడా.

First Published:  24 Oct 2023 10:15 AM GMT
Next Story