Telugu Global
Business

Hyundai Creta | మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో బెస్ట్ హ్యుండాయ్.. మారుతి బ్రెజా.. టాటా నెక్సాన్ ఆ త‌ర్వాతే..!

Hyundai Creta | దాదాపు ప‌దేండ్ల క్రితం వ‌ర‌కూ బుల్లికార్లు.. సెడాన్లు.. హ్యాచ్‌బ్యాక్ కార్ల‌కు గిరాకీ ఉండేది. క‌రోనా మ‌హమ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి.. స్పేసియ‌స్‌గా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)ల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది.

Hyundai Creta | మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో బెస్ట్ హ్యుండాయ్.. మారుతి బ్రెజా.. టాటా నెక్సాన్ ఆ త‌ర్వాతే..!
X

Hyundai Creta | మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో బెస్ట్ హ్యుండాయ్.. మారుతి బ్రెజా.. టాటా నెక్సాన్ ఆ త‌ర్వాతే..!

Hyundai Creta | దాదాపు ప‌దేండ్ల క్రితం వ‌ర‌కూ బుల్లికార్లు.. సెడాన్లు.. హ్యాచ్‌బ్యాక్ కార్ల‌కు గిరాకీ ఉండేది. క‌రోనా మ‌హమ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి.. స్పేసియ‌స్‌గా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)ల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది. గ‌త నెల మొత్తం కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీల వాటా 52 శాతానికి చేరుకున్న‌ది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24) తొలి ఆరు నెల‌ల్లో (ఏప్రిల్-సెప్టెంబ‌ర్‌) 20 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు అమ్ముడైతే.. అందులో అత్య‌ధిక వాటా ఎస్‌యూవీల‌దే.

దేశంలో అత్యాధునిక టెక్నాల‌జీ కార్ల‌ను ప‌రిచ‌యం చేసిన మారుతి సుజుకి ఎస్‌యూవీల త‌యారీలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ గ‌ట్టి పోటీ ఇస్తున్నాయి. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా సైతం మార్కెట్‌లో గ‌ణ‌నీయ వాటా పెంచుకుంటున్న‌ది. గ‌త ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ అమ్ముడైన ఎస్‌యూవీ కార్ల‌లో హ్యుండాయ్ మోటార్స్ క్రెటా లీడ్‌లో కొన‌సాగుతుండ‌గా, త‌ర్వాతీ స్థానంలో మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ నిలిచాయి.

2023-24 ఏప్రిల్‌-సెప్టెంబ‌ర్ మ‌ధ్య దేశీయ మార్కెట్లో హ్యుండాయ్ క్రెటా 83,693 యూనిట్లు విక్ర‌యించ‌గా, త‌ర్వాతీ స్థానంలో 81,928 యూనిట్ల‌తో మారుతి సుజుకి, 78,975 యూనిట్ల‌తో టాటా నెక్సాన్ మూడో స్థానంలో నిలిచాయి.

ఇటీవ‌ల మారుతి సుజుకి మార్కెట్‌లో విడుద‌ల చేసిన గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ మాదిరే హ్యుండాయ్ క్రెటా సైతం క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. హ్యుండాయ్ క్రెటా కారు ధ‌ర రూ.10.87 - రూ.19.20 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. ఈ పాపుల‌ర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 1.5 లీట‌ర్ల ఎంపీఐ పెట్రోల్ (MPi petrol) ఇంజిన్ సామ‌ర్థ్యం కారు గ‌రిష్టంగా 115 పీఎస్ విద్యుత్‌, 144 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 1.5 లీట‌ర్ల యూ2 సీఆర్డీఐ (1.5-litre U2 CRDi) డీజిల్ (116 పీఎస్‌/250 ఎన్ఎం) ఆప్ష‌న్‌తో వ‌స్తుంది. పెట్రోల్ వేరియంట్ కారు 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా ఐవీటీ వ‌ర్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఇక డీజిల్ వేరియంట్ 6- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్మిష‌న్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వ‌ర్ష‌న‌ల‌లో ల‌భిస్తుంది.

హ్యుండాయ్ క్రెటాకు మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ గ‌ట్టి పోటీనిచ్చే మోడ‌ల్ కార్లు. ఇటీవ‌లే మార్కెట్లోకి టాటా మోటార్స్ నెక్సాన్ కారును మ‌ళ్లీ అప్‌డేట్ చేసి ఆవిష్కరించింది. గ‌త నెల 14న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ చేసింది.


రెండో స్థానంలో ఉన్న మారుతి సుజుకి మిడ్ సైజ్ ఎస్‌యూవీ బ్రెజా ధ‌ర రూ.8.29 lల‌క్ష‌ల నుంచి రూ.14.14 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. మారుతి బ్రెజా కే15 సీ మొడ‌ల్ 1.5 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంట‌ది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్మిష‌న్ లేదా 6-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో వ‌స్తున్న ఈ కారు ఇంజిన్ గ‌రిష్టంగా 103 పీఎస్ విద్యుత్, 137 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. సీఎన్జీ వేరియంట్ బ్రెజా ఇంజిన్ గ‌రిష్టంగా 88 పీఎస్ విద్యుత్‌, 121 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో ప‌ని చేస్తుంది.




టాటా నెక్సాన్ కారు ధ‌ర రూ.8.10 ల‌క్ష‌ల నుంచి రూ.15.50 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. ఈ మిడ్ సైజ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు రెండు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. రెవ‌ట్రాన్ 1.2- లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ (Revotron 1.2-litre turbo petrol) ఇంజిన్ గ‌రిష్టంగా 120 పీఎస్ విద్యుత్‌, 170 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. రెవోటార్క్ 1.5 లీట‌ర్ల డీజిల్ (Revotorq 1.5-litre diesel) ఇంజిన్ గ‌రిష్టంగా 115 పీఎస్ విద్యుత్‌, 260 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. టాటా నెక్సాన్ పెట్రోల్ కారు 5- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీఏ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. నెక్సాన్ డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.



First Published:  12 Oct 2023 7:24 AM GMT
Next Story