Telugu Global
Business

పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట

కొన్నిరోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది

పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట
X

పెండ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. మన సంస్కృతి, సంప్రదాయాలతో పసిడి అంతగా ముడిపడిపోయింది. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీ ఉన్నది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ఇటీవల బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ ట్రెండ్‌ నిరంతరం కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. ఈ క్రమంలో నేడు సెప్టెంబర్‌ 29న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 77,400 చేరుకున్నది. అదే స్వచ్ఛత కలిగిన 100 గ్రాముల గోల్డ్‌ రూ. 500 తగ్గి రూ. 7,74,000లకు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 70,950 స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 95, 000కి చేరుకోగా, 100 గ్రాముల వెండి ధర రూ. 100 తగ్గి రూ. 9,500 కి చేరింది.

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్‌) (2 క్యారెట్‌) ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో రూ. 77,400, రూ. 70,950

విజయవాడలో రూ. 77,400, రూ. 70,950

ఢిల్లీ లో రూ. 77,550, రూ. 71,100

ముంబైలో రూ. 77,400, రూ. 70,950

బెంగళూరులో రూ. 77,400, రూ. 70,950

కోల్‌కతాలో రూ. 77,400, రూ. 70,950

చెన్నైలో రూ. 77,400, రూ. 70,950

పూణెలో రూ. 77,400, రూ. 70,950

ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

హైదరాబాద్‌లో రూ.1,01, 000

విజయవాడలో రూ.1,01, 000

ఢిల్లీ లో రూ. 95,000

ముంబైలో రూ. 95,000

బెంగళూరులో రూ. 85,000

కోల్‌కతాలో రూ. 95,000

చెన్నైలో రూ.1,01, 000

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకోవాలని సూచన

First Published:  29 Sept 2024 1:43 AM GMT
Next Story