Telugu Global
Business

డిసెంబర్‌‌లో వచ్చే మొబైల్స్ ఇవే..

Upcoming Smartphones in December 2022: ఈ ఏడాదిలో చివరి నెలలో చాలా మొబైల్‌ కంపెనీలు తమ కొత్త మొబైల్ ఫోన్స్‌ను రిలీజ్ చేయనున్నాయి. వీటిలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లే ఎక్కువ ఉన్నాయి.

Upcoming Smartphones in December 2022
X

Upcoming Smartphones in December 2022: డిసెంబర్‌‌లో వచ్చే మొబైల్స్ ఇవే..

ఈ ఏడాదిలో చివరి నెలలో చాలా మొబైల్‌ కంపెనీలు తమ కొత్త మొబైల్ ఫోన్స్‌ను రిలీజ్ చేయనున్నాయి. వీటిలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లే ఎక్కువ ఉన్నాయి. ఈ డిసెంబరులో రాబోయే మొబైల్ సిరీస్‌లు ఓ లుక్కేస్తే..

వన్‌ప్లస్‌ 11 సిరీస్‌

వన్‌ప్లస్ నుంచి ఈ నెలాఖరిలో సరికొత్త 11 సిరీస్ మొబైల్స్ రానున్నాయి. వీటిలో స్నాప్ డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13తో ఈ సిరీస్ రానుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ వైర్, 50 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మీ 10 సిరీస్‌

ఈ నెలలో రియల్‌మీ నుంచి 10 సిరీస్‌లో మూడు ఫోన్లు రానున్నాయి. వీటిలో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌, మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్లు ఉపయోగించారు. ఈ సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉండొచ్చు. వేరియంట్‌ను బట్టి రూ.15 వేల నుంచి రూ. 30 వేల వరకూ ధర ఉండొచ్చు.

ఐకూ 11 సిరీస్‌

ఈ నెల మొదటి వారంలోనే ఐకూ నుంచి 11 సిరీస్ రానుంది. ఇందులో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ వైర్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐకూ నియో సిరీస్ నుంచి కూడా మొబైళ్లు రానున్నాయి. అందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మిగతా ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.

వివో ఎక్స్ 90 సిరీస్‌

వివో ఎక్స్ సిరీస్‌ నుంచి ఈ నెల చివర్లో కొత్త మోడల్స్ రానున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్లతో ఈ మొబైళ్లు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఫోన్‌ల ధర రూ. 45 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉండొచ్చు.

షావోమి 13 సిరీస్‌

షావోమి నుంచి ఈ నెలాఖరులోగా లేటెస్ట్ 13 సిరీస్ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇండియాలో కూడా రిలీజ్ అవ్వనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 50 ఎంపీ లైకా లెన్స్‌తో కూడిన కెమెరాతో ఉంటుంది. ధర ఎంత నిర్ణయిస్తారో తెలియాల్సి ఉంది.

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 20 సిరీస్‌

ఇన్ఫినిక్స్‌ కంపెనీ నుంచి హాట్ 20 సిరీస్ పేరుతో తక్కువ ధరలో 5జీ ఫోన్లు రాబోతున్నాయి. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వీటి ధర రూ. 15 వేల లోపు ఉండొచ్చు.

ఒప్పో రెనో 9 సిరీస్‌

ఒప్పో నుంచి రెనో సిరీస్‌లో మరో కొత్త మోడల్స్ రానున్నాయి. ఒప్పో రెనో 9, రెనో 9 ప్రో, రెనో 9 ప్రో+ పేర్లతో రిలీజ్ అవుతున్న ఈ మొబైళ్లలో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వీటిలో వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ధర రూ. 34 వేల లోపు ఉండొచ్చు.

రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌

రెడ్‌మీ నోట్ సిరీస్ నుంచి ఈ నెలలో లేటెస్ట్ 5జీ మొబైల్స్ రిలీజ్ అవ్వనున్నాయి. రెడ్‌మీ నోట్ 12 5జీ, నోట్‌ 12 ప్రో+ 5జీ పేర్లతో ఇవి రానున్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

First Published:  3 Dec 2022 11:17 AM GMT
Next Story