Telugu Global
Business

శాంసంగ్ నుంచి మూడు మిడ్‌రేంజ్ ఫోన్లు! ఫీచర్లివే..

రీసెంట్‌గా శాసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎ25 5జీ’, ‘గెలాక్సీ ఎ15 5జీ’, ‘గెలాక్సీ ఎ15 4జీ’ పేర్లతో మూడు ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

శాంసంగ్ నుంచి మూడు మిడ్‌రేంజ్ ఫోన్లు! ఫీచర్లివే..
X

సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ అయిన శాంసంగ్‌కు మనదేశంలో మంచి పాపులారిటీ ఉంది. శాంసంగ్ ఫోన్స్ అంటే మినిమం గ్యారెంటీ అని నమ్ముతుంటారు. అందుకే మిడ్ రేంజ్ ఫోన్స్‌లో శాంసంగ్ మొబైల్స్‌కు సేల్స్ ఎక్కువ. అయితే త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్ నుంచి రెండు ఫోన్లు రిలీజవ్వనున్నాయి. వాటి ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

రీసెంట్‌గా శాసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎ25 5జీ’, ‘గెలాక్సీ ఎ15 5జీ’, ‘గెలాక్సీ ఎ15 4జీ’ పేర్లతో మూడు ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. ఇవి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా రానున్నాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.0 వర్షన్‌పై పని చేస్తాయి. ధరలు రూ.20,000 రేంజ్‌లో ఉంటాయి.

కొత్త ‘ఎ’ సిరీస్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఎక్సినోస్ 1280 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ఇది బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ధర సుమారు 22,500 ఉండొచ్చు.

ఇక గెలాక్సీ ఎ15 5జీ ఫోన్.. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ధర రూ.21,500 ఉండొచ్చు.

గెలాక్సీ ఎ15 4జీ విషయానికొస్తే దీని ధర రూ.17,100 ఉండొచ్చు. ఇందులో కూడా 6.5 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో జీ99 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.

ఈ మూడు ‘ఎ’ సిరీస్ ఫోన్లలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 5 మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరాలు ఉంటాయి. గెలాక్సీ ఎ 25 5జీ ఫోన్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. మూడు ఫోన్లలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్లకు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఉంటుంది. వీటికి బాక్స్‌లో ఛార్జర్‌ రాదు. అడాప్టర్‌‌ను విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

First Published:  13 Dec 2023 9:45 AM GMT
Next Story