Telugu Global
Business

Rupay Forex Cards | విదేశీ యానం చేసే ఇండియ‌న్స్‌కు పేమెంట్స్ ఆప్ష‌న్స్ ఈజీ.. రూపే ఫారెక్స్ కార్డుల జారీకి ఆర్బీఐ ఓకే

Rupay Forex Cards | విదేశాల్లో ఏటీఎంలు, పీవోఎస్ యంత్రాలు, ఆన్‌లైన్ మ‌ర్చంట్స్ వ‌ద్ద వాడేందుకు వీలుగా బ్యాంకులు రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు జారీ చేయ‌డానికి ఆర్బీఐ అనుమ‌తి ఇచ్చింది.

Rupay Forex Cards
X

Rupay Forex Cards

Rupay Forex Cards | విదేశాల్లో ఏటీఎంలు, పీవోఎస్ యంత్రాలు, ఆన్‌లైన్ మ‌ర్చంట్స్ వ‌ద్ద వాడేందుకు వీలుగా బ్యాంకులు రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు జారీ చేయ‌డానికి ఆర్బీఐ అనుమ‌తి ఇచ్చింది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్త సేవ‌ల విస్త‌ర‌ణ‌కు రూపే డెబిట్‌, రూపే క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు జారీ చేసేందుకు కూడా ఆర్బీఐ స‌రేన‌న్న‌ది. తద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూపే కార్డుల లభ్య‌త‌, ఆమోదం పెంచడానికి వెసులుబాటు క‌లుగుతుంది.

వివిధ దేశాలతో, అంతర్జాతీయ ఆర్థిక సేవ‌ల సంస్థ‌ల‌తో ద్వైపాక్షిక ఒప్పందాల, భాగ‌స్వామ్య ఒప్పందాల‌ ద్వారా భార‌త్ బ్యాంకులు జారీ చేస్తున్న రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల‌కు రోజురోజుకు ఆమోదం పెరుగుతున్న‌ది. అంత‌ర్జాతీయ కార్డుల జారీ సంస్థ‌ల‌తో క‌లిసి రూపే డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి భార‌త్ బ్యాంకులు.

విదేశాల్లో ప్ర‌యాణిస్తున్న భార‌తీయుల‌కు చెల్లింపు ఆప్ష‌న్లు మ‌రింత మెరుగు ప‌డేలా భార‌త్ బ్యాంకులు రూపే-ఫారెక్స్ కార్డులు జారీ చేయాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది. ఆర్బీఐ పేమెంట్స్ విజ‌న్ 2025 క‌ల్లా యూపీఐ, రూపే కార్డుల జారీ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని.. అంత‌ర్జాతీయంగా ప్ర‌ధాన సంస్థ‌గా నిల‌పాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ సంస్థ‌ల భాగ‌స్వామ్యం లేకుండా భూటాన్‌, సింగ‌పూర్‌, నేపాల్‌, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో రూపే కార్డులు వాడుతున్నారు. ఇత‌ర దేశాల్లోనూ రూపే కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను ఆర్బీఐ ప‌రిశీలించ‌నున్న‌ది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా-ఎన్పీసీఐ అనుబంధ ఇంట‌ర్నేష‌న‌ల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఐపీఎల్ ఆధ్వ‌ర్యంలో సీమాంత‌ర చెల్లింపుల‌కు, యూపీఐ సేవ‌లు, రూపే కార్డుల జారీకి శ‌క్తిమంత‌మైన భాగ‌స్వామ్యం అవ‌స‌రం అని ఆర్బీఐ భావిస్తున్న‌ది.

ఇలా జారీ చేస్తున్న రూపే ప్రీ పెయిడ్ కార్డుల‌కు జారీ న‌గ‌దు లోడ్ చేసిన రోజు నుంచి క‌నీసం ఏడాది పాటు చెల్లుబాటు గ‌డువు ఉంటుంది. రూపే ప్రీపెయిడ్ కార్డులు దీర్ఘ‌కాల చెల్లుబాట‌య్యేలా జారీ చేయ‌వ‌చ్చు. ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న ఫిజిక‌ల్ డెబిట్ కార్డుల‌తో పోలిస్తే రూపే ప్రీ పెయిడ్ కార్డులు విభిన్నం. పీపీఐ-ఎంటీఎస్ కింద జారీ చేసిన రూపే ప్రీ పెయిడ్ కార్డులు మిన‌హా ఇత‌ర డెబిట్ కార్డుల‌కు అడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ ఆఫ్ అథంటికేష‌న్ అవ‌స‌రం.

ఇదిలా ఉంటే, బ్యాంకింగేత‌ర ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ జారీ సంస్థ‌ల‌కు కూడా ఈ-రూపీ ఓచ‌ర్ల జారీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ-రూపీ జారీ రీడెమ్ష‌న్ మ‌రింత తేలిక ప‌రిచింది. వ్య‌క్తుల త‌రఫున ఈ-రూపీ జారీ చేయ‌డానికి ఆమోదం తెలిపింది. డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతాయ‌ని, ఎక్కువ మంది యూజ‌ర్ల‌కు ఈ-రూపీ ఓచ‌ర్ల ప్ర‌యోజ‌నాలు ల‌భిస్ఆయ‌ని తెలిపింది. ఎన్పీసీఐతోపాటు దేశంలోని 11 బ్యాంకులు మాత్ర‌మే ఈ-రూపీ జారీ చేస్తున్నాయి.

First Published:  9 Jun 2023 12:02 PM GMT
Next Story