Telugu Global
Business

రూ.3.7 కోట్ల ఇంటిని రూ.280కే ఇస్తారట.. అదెలాగంటే..

ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది..? రూ.280కే.. ఎందుకు ఇస్తామంటున్నారు..? అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? దీనికోసం అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

రూ.3.7 కోట్ల ఇంటిని రూ.280కే ఇస్తారట.. అదెలాగంటే..
X

బిజినెస్ చేయడం అందరికీ సాధ్యం కాదు.. అది కూడా ఒక కళే. కానీ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం తమ ఆలోచనే పెట్టుబడిగా బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. ఇక ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఓ ఇంటిని అమ్మాలనుకున్నారు. ఖరీదు చూస్తే కోట్లలో ఉంది. కొనడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ క్రమంలో తమ ఆలోచనకు పదును పెట్టారు. రూ.3.7కోట్ల ఖరీదైన ఇల్లును రూ.280కే అందిస్తామంటూ ప్రకటించేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. వారి బిజినెస్ ఐడియాను మెచ్చుకుని తీరాల్సిందే.


ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది..? రూ.280కే.. ఎందుకు ఇస్తామంటున్నారు..? అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? దీనికోసం అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. బ్రిటన్‌కు చెందిన డానియల్‌, జాన్సన్‌, ట్వెన్‌ఫోర్ ముగ్గురు అన్నదమ్ములు. వీరు ముగ్గురూ కొవిడ్ సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. ముందే అనుకున్నాం కదా.. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందని. అలాగే ఒక ఐడియా వీరి జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. ఇక ఈ క్రమంలోనే మూడు స్టేర్ల ఇంటిని అమ్మాలనుకున్నారు.


రూ.3.7 కోట్ల విలువైన ఆ ఇంటిలో స్టైలిష్‌ ఫర్నీచర్‌. నాలుగు పెద్ద పెద్ద బెడ్రూంలు, విశాలమైన కిచెన్‌తో పాటు డైనింగ్‌ ఏరియా, లివింగ్ రూమ్ ఉన్నాయి. నిజానికి ఈ ఇంటి అద్దె సుమారు రూ.1,88,000 ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక మాస్టర్ ప్లాన్ వేసిన అన్నదమ్ములు తమ వద్ద రూ. 280తో లాటరీ కొంటే ఆ ఇంటిని ఇచ్చేస్తామని ప్రకటించారు. రూ.3.7 కోట్ల విలువైన ఇల్లు వస్తుందంటే.. రూ.280 కోసం చూసుకుంటారా..? తప్పక లాటరీ కొనేస్తారు. వీరికి ఆ ఇంటి ధర రావాలంటే 1,55,000 టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది.


మరి ఒకవేళ అన్ని టిక్కెట్లు అమ్ముడుపోకుంటే..? నష్టం వస్తుంది కదా.. అంటారా? దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచించే పెట్టారు. తమ వద్ద ఉన్న టిక్కెట్లన్నీ అమ్ముడు పోకుంటే.. లాటరీ తీసి అందులో గెలిచిన విజేతకు ఇంటికి బదులుగా లాటరీ మొత్తం నగదులో 70 శాతం అందిస్తారు. ఇక ఈ ఇల్లు బ్రిటన్‌ కెంట్‌లోని మెడ్‌వేలో ఉంది. ట్రామ్‌వే పాత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకూ ఈ ముగ్గురు సోదరులు నష్టపోలేదట.

First Published:  8 Nov 2022 11:47 AM GMT
Next Story