Telugu Global
Business

రెడ్‌మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్! ఏడు వేలకే బోలెడు ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ నుంచి కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. కేవలం రూ.7,299 ధరకు లభిస్తున్న ఈ మొబైల్ లో బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి.

రెడ్‌మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్! ఏడు వేలకే బోలెడు ఫీచర్లు!
X

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ నుంచి కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. కేవలం రూ.7,299 ధరకు లభిస్తున్న ఈ మొబైల్ లో బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

రెడ్‌మీ ఎంట్రీ లెవల్ సిరీస్ లో భాగంగా సరికొత్త ‘రెడ్‌మీ ఏ3’ మొబైల్ ఫిబ్రవరి 14న ఇండియాలో రిలీజయింది. ఇది మీడియాటెక్ హెలియో జీ36 ఎస్ఓసీ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.71-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇందులో అమర్చారు. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. కెమెరాల విషయానికొస్తే.. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్‌‌తో పాటు మరో ఏఐ బ్యాక్డ్ సెకండరీ కెమెరా ఉంది. ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మీ ఏ3 మొబైల్‌లో 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇందులో 3జీబీ, 4జీబీ, 5జీబీ ర్యామ్ వేరింయంట్లు ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌‌తో ర్యామ్‌ను 12జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.

ఇకపోతే రెడ్‌మీ ఏ3 డ్యూయల్-నానో సిమ్ స్లాట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్ ఉంది. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో-యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక ధరల విషయానికొస్తే.. 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ. 8,299, 6జీబీ + 128జీబీ మోడల్ ధర రూ. 9,299గా ఉన్నాయి. ఈ మొబైల్ మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ అనే మూడు కలర్ఆప్షన్స్‌లో లభిస్తుంది.

First Published:  15 Feb 2024 11:54 AM GMT
Next Story