Telugu Global
Business

Realme C67 5G | మినీ క్యాప్సూల్ 2.0తో భార‌త్ మార్కెట్లోకి రియ‌ల్‌మీ సీ67 5జీ ఫోన్‌.. ధ‌రెంతో తెలుసా..?!

Realme C67 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) ఫోన్ భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Realme C67 5G | మినీ క్యాప్సూల్ 2.0తో భార‌త్ మార్కెట్లోకి రియ‌ల్‌మీ సీ67 5జీ ఫోన్‌.. ధ‌రెంతో తెలుసా..?!
X

Realme C67 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) ఫోన్ భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. మినీ క్యాప్సూల్‌తో 5జీ సెగ్మెంట్‌లో భార‌త్ మార్కెట్లోకి రియ‌ల్‌మీ తీసుకొచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ సీ సిరీస్ ఫోన్ ఇదే. 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్యుయ‌ల్ రేర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తున్న‌ది. 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తు క‌లిగి ఉంటుంది.

డార్క్ ప‌ర్పుల్‌, సన్నీ ఒయాసిస్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉన్న రియ‌ల్‌మీ సీ67 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999ల‌కు ల‌భిస్తుంది. ఈ నెల 16 నుంచి దేశంలోని రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తాయి. శనివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. ఆస‌క్తిగ‌ల క‌స్ట‌మ‌ర్ల‌కు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కు ఆఫ‌ర్లు అందిస్తున్న‌ది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ.1500 వ‌ర‌కు ఆఫ‌ర్లు పొందొచ్చు.

రియ‌ల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వ‌స్తున్న‌ది. 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. సూర్య‌కాంతి ప‌డిన‌ప్పుడు బ్యాక్ ప్యానెల్ స‌న్నీ ఒయాసిస్ డిజైన్‌ను త‌ల‌పిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 4.0 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. నోటిఫికేష‌న్లు, ఇత‌ర అల‌ర్ట్‌ల‌ను తెలిపేందుకు మినీ క్యాప్సూల్ 2.0 ఫీచ‌ర్ ఉంటుంది.

6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తున్న రియ‌ల్‌మీ సీ67 (Realme C67 5G) ఫోన్ 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ర్యామ్ వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 6 జీబీ పెంచుకోవ‌చ్చు. అలాగే మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీని రెండు టిగా బైట్ల వ‌ర‌కూ విస్త‌రించ‌వ‌చ్చు. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

రియ‌ల్‌మీ సీ67 5జీ (Realme C67 5G) ఫోన్ 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది. 29 నిమిషాల్లో ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో 50 శాతం చార్జింగ్ చేయొచ్చు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంది.

First Published:  15 Dec 2023 6:00 AM GMT
Next Story