Telugu Global
Business

నేడు (06-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

వెండి కూడా కిలోపై రూ.1300 మేర పెరిగి రూ.66,500కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపించాయి.

నేడు (06-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర..
X

ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. అసలే మూఢాలంటూ గత కొంత కాలంగా పెళ్లిళ్లే లేవు. దీంతో ఇప్పుడు సీజన్ మొదలైందో లేదో పెద్దఎత్తున వివాహాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. నాలుగు రోజుల పాటు పెరిగిన బంగారం ధర నిన్న స్థిరంగా ఉంది. తిరిగి నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110కి చేరుకుంది. 22 క్యారెట్లపై రూ.150 మేర పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. ఇక వెండి కూడా కిలోపై రూ.1300 మేర పెరిగి రూ.66,500కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల మార్కును దాటేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,600.. రూ.54,110

విజయవాడలో రూ.49,600.. రూ.54,110

విశాఖలో రూ.49,600.. రూ.54,110

చెన్నైలో రూ.50,450.. రూ.55,040

బెంగళూరులో రూ.49,650.. రూ.54,160

కేరళలో రూ.49,600.. రూ.54,110

ముంబైలో రూ.49,600.. రూ.54,110

ఢిల్లీలో రూ.49,750.. రూ.54,260

కోల్‌కతాలో రూ.49,600.. రూ.54,110

వెండి ధర..

హైదరాబాద్‌లో రూ.72,500

విజయవాడలో రూ.72,500

విశాఖలో రూ.72,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500

బెంగళూరులో రూ.72,500

కేరళలో రూ.72,500

ముంబైలో రూ.66,500

ఢిల్లీలో రూ.66,500

కోల్‌కతాలో కిలో వెండి రూ.72,500

First Published:  6 Dec 2022 4:28 AM GMT
Next Story