Telugu Global
Business

Maruti Suzuki Jimny | ఎస్‌యూవీల ప‌ట్ల ఇండియ‌న్స్ మోజు.. మారుతి జిమ్నీ కోసం బుకింగ్స్ 24,500

మారుతి సుజుకి జిమ్నీ ఈ నెలాఖ‌రులో గానీ, వ‌చ్చేనెల ప్రారంభంలో గానీ మార్కెట్లోకి రానున్న‌ది. దీని ధ‌ర రూ.11 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.

Maruti Suzuki Jimny | ఎస్‌యూవీల ప‌ట్ల ఇండియ‌న్స్ మోజు.. మారుతి జిమ్నీ కోసం బుకింగ్స్ 24,500
X

Maruti Suzuki Jimny | రోజురోజుకూ ఎస్‌యూఈ కార్ల‌పై భార‌తీయుల మోజు పెరిగిపోతున్న‌ది. ప్ర‌తి నెలా దేశీయంగా అమ్ముడ‌వుతున్న ప్ర‌తి రెండు కార్ల‌లో ఒక‌టి ఎస్‌యూవీ కారు అంటే అతిశ‌యోక్తి కాదు. అందులోనూ మార్కెట్ లీడ‌ర్ మారుతి సుజుకి త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్న స‌బ్‌-4 కంపాక్ట్ ఎస్‌యూవీ జిమ్నీ ప‌ట్ల ఎంతోమంది ఆస‌క్తి పెంచుకున్నారు. ఈ నాలుగు డోర్ల జిమ్నీ ఎస్‌యూవీ కోసం ఇప్ప‌టికే 24,500 బుకింగ్స్ న‌మోదైన‌ట్లు స‌మాచారం. దీంతో భార‌తీయులు మారుతి జిమ్నీ ఎస్‌యూవీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని అర్థ‌మ‌వుతున్న‌ది.

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి తీసుకొచ్చిన ఎస్‌యూవీ కార్ల‌లో ఇది నాల్గ‌వ‌ది. బ్రెజా, గ్రాండ్ విటారా ఎస్‌యూవీ కార్లు ఇప్ప‌టికే మార్కెట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ఇటీవ‌లే ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశీయ ఎస్‌యూఈ కార్ల మార్కెట్‌లో 25 శాతం వాటా కొట్టేయాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది మారుతి సుజుకి. అందుకు ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న బ్రెజా, గ్రాండ్ విటారాతోపాటు కొత్తగా మార్కెట్‌లోకి తెస్తున్న‌ ఫ్రాంక్స్‌, జిమ్నీల‌పైనే ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న‌ది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23)లో దాదాపు అన్ని కార్ల త‌యారీ సంస్థ‌లు 16.73 ల‌క్ష‌ల ఎస్‌యూవీ కార్లు విక్ర‌యించాయి. అందులో మారుతి సుజుకి వాటా 2.02 ల‌క్ష‌లే. అంటే మొత్తం ఎస్‌యూవీల్లో మారుతి వాటా 12.07 శాతం అన్న‌మాట‌. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీలో నిర్వ‌హించింన ఆటో ఎక్స్‌పో-2023లో మారుతి సుజుకి.. జిమ్నీ, ఫాంక్స్‌ల‌ను ఆవిష్క‌రించింది. ఇగ్నీస్‌, బాలెనో, సియాజ్‌, ఎక్స్ఎల్‌-6, గ్రాండ్ విటారాల‌తోపాటు మారుతి సుజుకి నెక్సా డీల‌ర్‌షిప్‌ల వ‌ద్ద ఈ రెండు ఎస్‌యూవీ కార్లు ల‌భ్యం అవుతాయి.

మారుతి సుజుకి జిమ్నీ ఈ నెలాఖ‌రులో గానీ, వ‌చ్చేనెల ప్రారంభంలో గానీ మార్కెట్లోకి రానున్న‌ది. దీని ధ‌ర రూ.11 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు. జిమ్నీ కారు కే15బీ 1.5 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 105 పీఎస్‌ల విద్యుత్‌, 134 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్సిమిష‌న్‌, 4-స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భ్యం అవుతుంద‌ని చెబుతున్నారు. జిమ్నీ కారు ఆల్‌గ్రిప్ ప్రో 4డ‌బ్ల్యూడీ టెక్నాల‌జీతో రూపుదిద్దుకున్న‌ది. దేశీయ మార్కెట్‌లోకి జెటా, ఆల్ఫా వేరియంట్ల‌లో ల‌భిస్తుంది.

First Published:  10 May 2023 1:52 PM GMT
Next Story