Telugu Global
Business

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు

భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50 ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లు తగ్గి 80,022 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 24,407 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.90 డాలర్ల వద్ద ఉన్నది. బంగారం ఔన్సు 2,736.20 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ సూచీలో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్‌ఎం, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు బుధవారం నికరంగా రూ. 5,684.63 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 6,039.90 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

First Published:  24 Oct 2024 5:44 AM GMT
Next Story