Telugu Global
Business

Anand Mahindra | స‌ర్ఫ‌రాజ్ తండ్రి కృషికి ఆనంద్ మ‌హీంద్రా ఫిదా.. అందుకు ఆయ‌నేం చేశారంటే..?!

Anand Mahindra | ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు.

Anand Mahindra | స‌ర్ఫ‌రాజ్ తండ్రి కృషికి ఆనంద్ మ‌హీంద్రా ఫిదా.. అందుకు ఆయ‌నేం చేశారంటే..?!
X

Anand Mahindra | ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు. టీం ఇండియా క్రికెట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తండ్రికి థార్ ఎస్‌యూవీ కారు ఆఫ‌ర్ చేశారు. టీం ఇండియాలో చోటు ద‌క్కించుకోవాల‌న్న క‌లను స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ సాకారం చేసుకోవ‌డంలో ఆయ‌న తండ్రి నౌష‌ద్‌ఖాన్ ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. కొడుకు స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ను మంచి క్రికెట‌ర్‌గా కోచ్‌గా నౌష‌ద్‌ఖాన్ తీర్చి దిద్దాడు. నౌష‌ద్ ఖాన్‌పై ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అందుకు నౌష‌ద్‌ఖాన్‌కు థార్ ఎస్‌యూవీ బ‌హుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యమై సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌) హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ధైర్యాన్ని వ‌దులుకోవ‌ద్దు అని వ్యాఖ్యానించారు.

స‌ర్ఫ‌రాజ్ కాన్‌లో క‌ష్ట‌ప‌డే త‌త్వం, ధైర్యం, సాహసం నింపే క్వాలిటీల‌ను నింప‌డంలో నౌష‌ద్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆనంద్ మ‌హీంద్రా పేర్కొన్నారు. స్ఫూర్తిదాయ‌క తండ్రిగా నౌష‌ద్‌ఖాన్‌కు తాము ఆఫ‌ర్ చేసిన థార్ కారు బ‌హుమ‌తిని స్వీక‌రించాల‌ని కోరుతున్నాం. ఆయ‌న స్వీక‌రిస్తే మాకు గౌర‌వం, గ‌ర్వ కార‌ణం అని తెలిపారు. ఏండ్ల‌ త‌ర‌బ‌డి కొన‌సాగిన ప‌ట్టుద‌ల‌, అంకిత భావం వ‌ల్లే టీం ఇండియా టెస్ట్ క్రికెట్‌లోకి స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఆగ‌మ‌నం ప్రారంభ‌మైంది. టీం ఇండియా టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికైన సంద‌ర్భంగా త‌న తండ్రితో గ‌ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

కేవ‌లం స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ను మాత్ర‌మే కాదు ఆయ‌న త‌మ్ముడు ముషీర్‌ఖాన్‌ను కూడా మంచి క్రికెట్‌గా తీర్చిదిద్దుతాన‌ని నౌష‌ద్‌ఖాన్ ప్ర‌క‌టించినందుకు ఆనంద్ మ‌హీంద్రా ఫిదా అయ్యారు. 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ యూ-19 టీం ఇండియా జ‌ట్టులో ముషీర్ ఖాన్ స‌భ్యుడిగా ఉన్నాడు. 15 ఏండ్లుగా స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌కు మార్గ‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నౌష‌ద్‌ఖాన్ త‌న కొడుకులో ప్ర‌తిభ‌ను వెలికి తీయ‌డంలోనూ, క్రికెట్ ప‌ట్ల మ‌క్కువ పెంచ‌డంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విజ‌యంలో నౌష‌ద్‌ఖాన్ స‌హ‌కారానికి ఫిదా అయినందునే ఆయ‌న‌కు థార్ ఎస్‌యూవీ కారు గిఫ్ట్‌గా ప్ర‌క‌టించాడు ఆనంద్ మ‌హీంద్రా.

రంజీ ట్రోఫీ క్రికెట్‌లో అద్భుత‌మైన ఆట తీరు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చిన స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ 2021-22 సీజ‌న్‌లో అత్య‌ధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో 982 ప‌రుగులు చేశాడు. స‌గ‌టున స్ఫూర్తిదాయ‌క ఆట ఆడ‌టంతో క్రికెట్ ప్రేమికుల గుండెల్లో నిలిచాడు. కేవ‌లం సర్ఫ‌రాజ్ ఖాన్ క్రికెట్ ప్ర‌యాణంలో నౌష‌ద్‌ఖాన్ పాత్ర‌ను మాత్ర‌మే కాక‌..ఆయ‌న‌లో ప్ర‌తిభ‌ను వెలికితీసేందుకు తండ్రిగా అందించిన ప్రోత్సాహం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు ఆనంద్ మ‌హీంద్రా.

2023 ప్రారంభంలో కొలంబో వేదిక‌గా టీం ఇండియా ఆట‌తీరు, పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన ఆనంద్ మ‌హీంద్రా తొలిసారి ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు థార్ ఎస్‌యూవీ బ‌హుమ‌తిగా అంద‌చేశాడు. నాటి నుంచి అంత‌ర్జాతీయంగా వివిధ క్రీడాంశాల్లో మెరిసిన ఇండియ‌న్ స్పోర్ట్ ప‌ర్స‌న్స్‌కు థార్ ఎస్‌యూవీ, ఎల‌క్ట్రిక్ ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ700 కార్లు బ‌హ‌మతులుగా అంద‌జేశాడు.

First Published:  18 Feb 2024 7:25 AM GMT
Next Story