Telugu Global
Business

Kia Seltos diesel | మార్కెట్‌లోకి కియా న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌.. ధ‌రెంతో తెలుసా..?!

Kia Seltos diesel | ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ కియా ఇండియా.. భార‌త్ మార్కెట్‌లోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌ను ఆవిష్క‌రించింది.

Kia Seltos diesel | మార్కెట్‌లోకి కియా న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌.. ధ‌రెంతో తెలుసా..?!
X

Kia Seltos diesel | ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ కియా ఇండియా.. భార‌త్ మార్కెట్‌లోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌ను ఆవిష్క‌రించింది. 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ఐదు ర‌కాల న్యూ సెల్టోస్ మోడ‌ల్స్‌తో వ‌చ్చింది. డీజిల్ ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో టెక్ లైన్ ట్రిమ్స్‌లో వ‌స్తోంది. డీజిల్ ఇంజిన్ వేరియంట్ కారు రూ.11,99,900 (ఎక్స్ షోరూమ్‌) ల‌కు ల‌భిస్తుంది. దీంతో కియా ప్రీమియం ఎస్‌యూవీ సెల్టోస్ మార్కెట్‌లోకి 24 వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. గ‌తేడాది జూలైలో కియా త‌న న్యూ సెల్టోస్ కారును మార్కెట్‌లో ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ 65 వేల యూనిట్లు విక్ర‌యించింది.

15 అత్యున్న‌త సేఫ్టీ ఫీచ‌ర్లు, 17 మోస్ట్ ఎవాల్వ్‌డ్ లెవెల్ 2-అడాస్ అటాన‌మ‌స్ ఫీచ‌ర్ల‌తోపాటు 32 సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి. డ్యుయ‌ల్ స్క్రీన్ ప‌నోర‌మిక్ డిస్‌ప్లే విత్ 26.04 సీఎం ఫుల్ డిజిట‌ల్ క్ల‌స్ట‌ర్‌, 26.03 సీఎం హెచ్‌డీ ట‌చ్ స్క్రీన్ నేవిగేష‌న్‌, డ్యుయ‌ల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీష‌న‌ర్‌, ఆర్17 43.66 క్రిస్ట‌ల్ క‌ట్ అల్లాయ్ వీల్స్, డ్యుయ‌ల్ పేన్ ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, ఎల‌క్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచ‌ర్లు జ‌త చేశారు.

బేస్ న్యూ సెల్టోస్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ రూ.11,99,900 ప‌లుకుతున్న‌ది. 1.5- లీట‌ర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ మోడ‌ల్ హెచ్‌టీకే వేరియంట్ 6-మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ రూ.13,59,900, హెచ్‌టీకే + 6ఎంటీ వేరియంట్ రూ.14,99,900, హెచ్‌టీఎక్స్ 6 ఎంటీ వేరియంట్ రూ.16,67,900, హెచ్‌టీకే+ 6 ఎంటీ వేరియంట్ రూ.18,27,900ల‌కు ల‌భిస్తాయి. 2019లో తొలిసారి భార‌త్ మార్కెట్‌లో సెల్టోస్ మోడ‌ల్ కారును కియా ఆవిష్క‌రించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ జాతీయంగా, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఆరు ల‌క్ష‌ల కియా సెల్టోస్ యూనిట్లు అమ్ముడు పోయాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విక్ర‌యిస్తున్న ప్ర‌తి ప‌ది కియా కార్ల‌లో సెల్టోస్ ఒక‌టి. భార‌త్‌లో కియా కార్ల విక్ర‌యాల్లో 51 శాతానికి పై చిలుకు సెల్టోస్‌దే..

First Published:  20 Jan 2024 8:02 AM GMT
Next Story