Telugu Global
Business

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. పూర్తి వివరాలివే..

అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 1జీబీ , 2జీబీ, 3జీబీ డేటా ప్లాన్స్, అలాగే ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్ యాక్సస్ కూడా పొందేలా రకరకాల ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది జియో.

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. పూర్తి వివరాలివే..
X

యూజర్లను ఆకర్షించేందుకు రిలయన్స్ జియో అట్రాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 1జీబీ , 2జీబీ, 3జీబీ డేటా ప్లాన్స్, అలాగే ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్ యాక్సస్ కూడా పొందేలా రకరకాల ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది జియో. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రూ. 419 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందొచ్చు. అలాగే మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

రూ.601 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 3జీబీ రోజువారీ డేటా పొందొచ్చు. జియో యాప్‌ల కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, అదనంగా 6జీబీ డేటాను కూడా పొందొచ్చు. జియో యూజర్లు ఈ ప్లాన్‌తో రూ. 499 విలువైన ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందొచ్చు.

రూ.1,199 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 3జీబీ రోజువారీ డేటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్స్ పొందొచ్చు. రూ.149 విలువైన మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.

రూ.4,199 ప్లాన్

ఇది వార్షిక ప్లాన్. ఈ ప్లాన్‌తో ఏడాది పాటు రోజుకి 3జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

First Published:  18 Sep 2022 6:41 AM GMT
Next Story