Telugu Global
Business

Insurance to Mutual Funds | బీమా 2 మ్యూచువ‌ల్ ఫండ్స్‌.. జియో ఫైనాన్సియ‌ల్ అస‌లు టార్గెట్ ఇదీ..!

Insurance to Mutual Funds | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services)’ ఇన్సూరెన్స్ మొద‌లు మ్యూచువ‌ల్ ఫండ్స్ బిజినెస్‌లోకి రానున్న‌ది.

Insurance to Mutual Funds | బీమా 2 మ్యూచువ‌ల్ ఫండ్స్‌.. జియో ఫైనాన్సియ‌ల్ అస‌లు టార్గెట్ ఇదీ..!
X

Insurance 2 Mutual Funds | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services)’ ఇన్సూరెన్స్ మొద‌లు మ్యూచువ‌ల్ ఫండ్స్ బిజినెస్‌లోకి రానున్న‌ది. ఈ సంగ‌తి సోమ‌వారం జ‌రిగిన రిల‌య‌న్స్ 46వ స‌ర్వ స‌భ్యుల సాధార‌ణ స‌మావేశంలో సంస్థ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు. గ‌త నెల 26న‌ జియో ఫైనాన్సియ‌ల్‌.. అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్ సంస్థ `బ్లాక్ రాక్‌`తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న జియో ఫైనాన్సియ‌ల్.. `జియో బ్లాక్ రాక్‌` అనే పేరుతో జాయింట్ వెంచ‌ర్ ఏర్పాటు చేసింది. ల‌క్ష‌ల మంది భార‌తీయ ఇన్వెస్ట‌ర్ల‌కు అత్యంత తేలిగ్గా సృజ‌నాత్మ‌క పెట్టుబ‌డి ప‌రిష్కారాలు అందించ‌డ‌మే ఈ `జియో బ్లాక్‌రాక్‌` సంస్థ ల‌క్ష్యం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ్యూచువ‌ల్ ఫండ్స్ రంగంలో ప‌ని చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్ రాక్ ఆస్తులు 11 ల‌క్ష‌ల డాల‌ర్ల పై చిలుకే. అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు గ‌ల సంస్థ `బ్లాక్ రాక్‌` తో క‌లిసి ఇన్వెస్ట‌ర్ల‌కు సృజ‌నాత్మ‌క‌, అత్యంత చౌక ప‌రిష్కార మార్గాలు అందుబాటులోకి తేవ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ తెలిపారు.

గ్లోబ‌ల్ అసెట్ సంస్థ `బ్లాక్ రాక్‌`తో జ‌త క‌ట్టిన జియో ఫైనాన్సియ‌ల్‌.. ఇన్సూరెన్స్ రంగంలో.. జ‌న‌ర‌ల్‌, లైఫ్‌, హెల్త్ కేర్ ఉత్ప‌త్తుల్లో ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ది. ఇందుకు గ్లోబ‌ల్ ఇన్సూరెన్స్ సంస్థ‌ల‌తో పార్ట‌న‌ర్‌షిప్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న‌ద‌నిముకేశ్ అంబానీ తెలిపారు. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇన్సూరెన్స్ ప్రొడ‌క్ట్స్ అందుబాటులోకి తెస్తుంద‌న్నారు. ప్ర‌పంచంలోనే ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేయ‌డానికి రిల‌య‌న్స్‌.. రూ.1.2 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెట్టింద‌ని చెప్పారు. ఇది పూర్తిగా అత్య‌ధికంగా పెట్టుబ‌డుల ఇన్సెంటివ్ బిజినెస్ అని అన్నారు.

First Published:  29 Aug 2023 7:45 AM GMT
Next Story