Telugu Global
Business

Flipkart Discounts on Mobiles | ఐ-ఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ ద్వారా పొకో మొబైల్స్‌పై ఆఫ‌ర్లు ఇలా

Flipkart Discounts on Mobiles | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు.. దాని ధ‌ర మాత్రం అంద‌నంత దూరంలో ఉంటుంది.

Flipkart Discounts on Mobiles | ఐ-ఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ ద్వారా పొకో మొబైల్స్‌పై ఆఫ‌ర్లు ఇలా
X

Flipkart Discounts on Mobiles | ఐ-ఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ ద్వారా పొకో మొబైల్స్‌పై ఆఫ‌ర్లు ఇలా

Flipkart Discounts on Mobiles | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు.. దాని ధ‌ర మాత్రం అంద‌నంత దూరంలో ఉంటుంది. ఈ-కామ‌ర్స్ జెయింట్‌ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. ఐ-ఫోన్ 13పై భార‌త్‌లో భారీగా డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్-13 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.69,900ల‌కు అందుబాటులో ఉన్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.11,151 ఫ్లాట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అంటే రూ.58,749ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు.

ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌తో రూ.57,999ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.750 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లో రూ.30 వేల వ‌ర‌కు ధ‌ర త‌గ్గ‌వ‌చ్చు. అయితే, ఎక్స్చేంజ్ చేస్తున్న ఫోన్ ఏజ్‌, ప‌నితీరు ఆధారంగా ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ డిస్కౌంట్ ఖ‌రారు చేస్తారు. ఫ్లిప్‌కార్ట్‌పై డిస్కౌంట్ లిమిటెడ్ ఆఫ‌రా.. సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతుందా? అన్న సంగ‌తి ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఆపిల్ ఐ-ఫోన్ల ప్రియుల‌కు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్‌.. ప‌లు పొకో ఫోన్ల‌పై భారీగా డిస్కౌంట్లు

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్.. భార‌తీయుల కోసం తాజాగా మ‌రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్ తీసుకొచ్చింది. శ‌నివారం ప్రారంభ‌మైన ఈ సేల్ ఈ నెల 14 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఇందులో భాగంగా ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ షియోమ ఈ అనుబంధ‌ పొకో హై ఎండ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్న‌ది. పొకో ఎఫ్‌5, పొకో ఎక్స్‌5 ప్రో 5జీల‌తోపాటు పొకొ ఎక్స్‌5 5జీ, పొకో ఎం5, పొకొ సీ55, పొకొ సీ51, పొకొ సీ50 ఫోన్ల‌పైనా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

పొకో ఎఫ్‌5 ఫోన్ ధ‌ర రూ.26,999 (బ్యాంక్ ఆఫ‌ర్ల‌తోపాటు) ల‌కే ల‌భిస్తుంది. లాంచింగ్ ధ‌ర కంటే రూ.3000 త‌క్కువ‌. పొకొ ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ ధ‌ర రూ.22,999 కాగా, రూ.21,999ల‌కే ల‌భ్యం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే మ‌రో రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.

పొకో ఎక్స్‌5 5జీ ఫోన్ రూ.18,999 కాగా ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.15,999ల‌కే అందుబాటులో ఉంది. బ్యాంకు డిస్కౌంట్ రూ.1000 క్యాష్ బ్యాక్‌తో క‌లిపి రూ.14,999ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. పొకో ఎం5 ఫోన్ అస‌లు ధ‌ర రూ.12,499 కాగా, ఇప్పుడు రూ.8999ల‌కే కొనుగోలు చేయొచ్చు. బ్యాంకు డిస్కౌంట్ రూ.5000 క‌లుపుకుంటే రూ.8,499ల‌కే సొంతం అవుతుంది.

ఇక ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్‌ పొకో సీ55 ఫోన్‌పై రూ.1750 డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీని లాంచింగ్‌ ధ‌ర రూ.9,499 కాగా, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్‌లో రూ.7,749ల‌కే అందుకోవ‌చ్చు. పొకో సీ51 ఫోన్ రూ.8499 కాగా, రూ.6999ల‌కు, పొకో సీ50 రూ.6,499 కాగా, రూ.5499ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

First Published:  10 Jun 2023 4:57 PM GMT
Next Story