Telugu Global
Business

5వ తేదీలోగా బుక్ చేసుకుంటే 1616కే విమాన టికెట్

5వ తేదీలోగా బుక్ చేసుకుంటే 1616కే  విమాన టికెట్
X

విమానప్రయాణీకులకు ఇండిగో సంస్థ తీపి కబురు వినిపించింది. ఓ స్వీట్ ఆఫర్ ను ప్రకటించింది. 1616 రూపాయలకే (పన్నులతో కలిపి)విమానటికెట్ అందిస్తోంది. అన్ని దేశీయ విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇండిగో సంస్థ ప్రారంభించి 16 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 'స్వీట్16' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే రేపటికి ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ లో టికెట్ కొన్న వాళ్ళు ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని టిక్కట్లను విక్రయిస్తారో అనే విషయాన్ని సంస్థ తెలియజేయలేదు.

అలాగే ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య HSBC క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను, కాచింగ్ క్రెడిట్ కార్డుపై 25 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా ఇండిగో ప్రకటించింది.

First Published:  4 Aug 2022 9:23 AM GMT
Next Story