Telugu Global
Business

Cars Sales | జ‌న‌వ‌రిలో రికార్డు స్థాయిలో కార్ల సేల్స్‌.. ఎస్‌యూవీల‌కు ఫుల్ గిరాకీ.. వాటికి క‌ష్ట‌కాల‌మేనా..!

Cars Sales | 2023తో పోలిస్తే గ‌త నెల ఆటోమొబైల్ సేల్స్‌లో 15 శాతం వృద్ధి సాధించింది. అన్ని సెగ్మెంట్ల‌లో డ‌బుల్ డిజిట్ గ్రోత్ న‌మోదైంది.

Cars Sales | జ‌న‌వ‌రిలో రికార్డు స్థాయిలో కార్ల సేల్స్‌.. ఎస్‌యూవీల‌కు ఫుల్ గిరాకీ.. వాటికి క‌ష్ట‌కాల‌మేనా..!
X

Cars Sales | 2023తో పోలిస్తే గ‌త నెల ఆటోమొబైల్ సేల్స్‌లో 15 శాతం వృద్ధి సాధించింది. అన్ని సెగ్మెంట్ల‌లో డ‌బుల్ డిజిట్ గ్రోత్ న‌మోదైంది. క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల విక్ర‌యాలు 0.1 శాతం పెరిగింది. చివరి త్రైమాసికంలో డిమాండ్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆటోమొబైల్ డీల‌ర్ సంఘాల స‌మాఖ్య (ఫాడా) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌త్యేకించి క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల విక్ర‌యాలకు క‌ష్ట‌కాల‌మేన‌ని హెచ్చ‌రించింది. గ‌త నెల‌లో టూ వీల‌ర్స్‌లో 15 శాతం, త్రీ వీల‌ర్స్‌ 37 శాతం, కార్ల విక్ర‌యాల్లో 13 శాతం, ట్రాక్ట‌ర్ల విక్ర‌యాల్లో 21 శాతం సేల్స్ పెరిగిపోయాయి. క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల విక్ర‌యాల్లో 0.1 శాతం వృద్ధిరేటు మాత్ర‌మే న‌మోదు కావ‌డం సంక్లిష్ట‌త‌కు సూచ‌న అని ఫాడా పేర్కొంది.

పోర్టుల్లో పెరిగిన యాక్టివిటీ, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి పురోగ‌తి, సానుకూల పంట‌ల దిగుబ‌డి సాధించ‌డంతో మార్కెట్‌లో డిమాండ్ పెరుగుద‌ల‌కు కార‌ణం అని ఫాడా పేర్కొంది. అయితే అతి వేడి వాతావ‌ర‌ణం, ద్ర‌వ్య ల‌భ్య‌త క‌ఠిన‌త‌రం వంటి కార‌ణాల‌తో అధిక వ్య‌యం గ‌ల వాహ‌నాల కొనుగోలుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని, ఫైనాన్సింగ్‌పై ప‌రిమితులు ఉన్నాయ‌ని ఫాడా అధ్య‌క్షుడు మ‌నీష్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు.

ద్విచ‌క్ర వాహ‌న సెగ్మెంట్ కొత్త వాహ‌నాల‌తోపాటు ప్రీమియం ఆప్ష‌న్ బైక్‌లు, స్కూట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌తో వృద్ధి సాధించింది. వాహ‌నాల ల‌భ్య‌త సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాల‌తోపాటు త్రీ వీల‌ర్స్ మార్కెట్‌లోనూ విద్యుత్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరిగింది. త్రీ వీల‌ర్స్ సేల్స్ 55 శాతం వృద్ధి చెందాయి.

కార్ల విక్ర‌యంలో 13 శాతం గ్రోత్ న‌మోదైంది. గ‌త నెల‌లో 3.93 ల‌క్ష‌ల కార్లు అమ్ముడ‌య్యాయి. ఎస్‌యూవీ కార్ల‌కు, కొత్త మోడ‌ల్ కార్ల‌కు, క‌న్జూమ‌ర్ స్కీమ్‌లు, పెండ్లిండ్ల‌లో కార్ల కొనుగోళ్ల‌కు ప్రాధాన్యం పెరిగింది. కార్ల డెలివ‌రీ స‌మ‌యం 50-55 రోజుల గ‌డువు ప‌ట్ట‌డం ఆందోళ‌న‌క‌రం అని ఫాడా పేర్కొంది.

First Published:  13 Feb 2024 7:00 AM GMT
Next Story