సరికొత్త రికార్డుల్లో సూచీలు
సెన్సెక్స్ 85,372.17 వద్ద తాజాగా గరిష్ఠాన్ని తాకగా..నిఫ్టీ కూడా 26,056 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటికే సరికొత్త జీవనకాల రికార్డులను తాకాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 202.3 పాయింట్లు పెరిగి 85,372.17 వద్ద తాజాగా గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 51.85 పాయింట్లు పెరిగి 26,056 ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటామోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ, టైటాన్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.51 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్స్ 2,684.90 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.68 వద్ద ప్రారంభమైంది.